అయితే దాడులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కు ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. ఎందుకంటే ఆయుధాలకే అధిక నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశానికి ఆర్థిక సాయం కావాలి. అయితే ఇజ్రాయెల్ కు రూ.లక్ష కోట్లు(14.3 బిలియన్ డాలర్లు) సైనిక ప్యాకేజీ ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన ప్రతిపాదనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు దాదాపు 10 వేల మంది పౌరులు మరణించారు. చనిపోయిన వారిలో సగం మంది పిల్లలే ఉన్నారు. దాదాపు 20 వేల మందికి గాయాలయ్యాయి.
అయినా ఇజ్రాయెల్ కు మరో లక్ష కోట్ల రూపాయల సైనిక సహాయ ప్యాకేజీని అందించడానికి అమెరికా ముందుకు రావడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా అందిస్తున్న ప్రోత్సాహం ఈ యుద్ధాన్ని మరింత పెంచి పోషిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ కు చేదోడు అందించడం అమెరికాకు వికటిస్తోంది.
పశ్చిమాసియాలోని కువైట్, బహ్రయిన్, ఇరాక్, సౌదీ అరేబియా. సిరియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతు కలిగిన దాడులు తీవ్రతరం అయ్యాయి. రూ. లక్ష కోట్ల ఆర్థిక సాయంపై సెనెట్ లో కొంత అడ్డంకి కావొచ్చని భావిస్తున్నారు. దీనిపై ట్రంప్ వర్గం అడ్డుతగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే బైడెన్ అధ్యక్ష స్థానానికి ఉన్న విచక్షణాధికారం ఉపయోగించైనా సరే ఈ ఆర్థిక సాయం విడుదల చేస్తానని హెచ్చరించారు. తన వీటో అధికారాలు అడ్డు పెట్టుకొని ఈ సాయం బైడెన్ అందించవచ్చు. చూద్దాం ఏమవుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి