తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఎన్నికల వ్యూహాల్లో తలామునకలై ఉన్నారు.  ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ లోనే మకాం వేశారు. ఇక ఎన్నికల యుద్ధం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా సాగుతున్నాయి.


అయితే ఈ రెండు రోజుల్లో ప్రజల మూడ్ ను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మార్చనున్నాయా అంటే చూడాలి ఏం జరుగుతుందో. ఎందుకుంటే ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయ్యారు. ఎవరికి ఓట్ వేయాలో వారికి ఓ స్పష్టత ఉంది. అది కాంగ్రెస్సా, బీజేపీయా, బీఆర్ఎస్సా అనేది తర్వాత విషయం. అయితే కొంతమంది తటస్థ ఓటర్లు మాత్రం ఇంకా తేల్చుకోలేరు. వీరు తమకు ముట్టే డబ్బులను బట్టే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకుంటారు.


ఒక పార్టీ రూ.500 ఇస్తే మరో పార్టీ రూ.1000, ఈ రెండు పార్టీలకు మించి మరొకటి రూ.2000 ఇలా వరుస కొనసాగుతుంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నాయకులతో పాటు ప్రజల అభిప్రాయాలు మారిపోయాయి. ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు కూడా అభ్యర్థులు సిద్ధమయ్యారు. అయితే ఆర్థిక వనరులు దండిగా ఉన్న నేతలు ఇరు పార్టీల్లో దండిగా ఉన్నారు.  కాంగ్రెస్ లో సుమారు 30-40మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటుకి ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ అయితే అన్ని స్థానాల్లో కూడా ఇలాంటి అభ్యర్థులే ఉన్నారు.


ఈ డబ్బుల ప్రభావం సుమారు 5 నుంచి 10శాతం ఓట్లను ప్రభావితం చేస్తోది. దీనిని ఎలా ఫేస్ చేస్తారు అనేది ఇప్పుడు అతి ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ 5-10శాతం ఓట్లే అతి కీలకమైనవి. అయితే ప్రభుత్వంపై కచ్చితంగా వ్యతిరేకత ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే. ఇది 10-20శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈ తటస్థుల ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా క్యాష్ చేసుకునేదాని బట్టి హస్తం విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: