జగన్ సర్కారుపై మరోసారి పవన్ కల్యాణ్‌ సైబర్ వార్‌ కు రెడీ అయ్యారు. గతంలో రోడ్ల విషయంలో సోషల్ మీడియా ద్వారా పోరాటం చేసిన జనసేన టీమ్ ఇప్పుడు జగనన్న కాలనీలను హైలెట్ చేయబోతోంది. జగనన్న కాలనీల పేరిట రాష్ట్రంలోనే అతి పెద్ద స్కాం జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ అంశంపై జగనన్న మోసం #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ తో ఆ ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని జనసైనికులకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు.


ఈ సైబర్ పోరాటం ద్వారా ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యాన్ని ప్రపంచానికి చూపిద్దామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జగనన్న కాలనీల్లో తొలి విడతలో 18లక్షల 63 వేల గృహాలు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కేవలం లక్ష 52వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకున్నారని మనోహర్ విమర్శించారు.


ఈ అవినీతిని బట్టబయలు చేయడానికే ఈ నెల 12, 13, 14 తేదీల్లో జనసేన సోషల్ ఆడిట్ చేపట్టిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ అధినేతపవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. 'జగనన్నఇళ్లు-పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.


రాష్ట్రంలోని అన్ని జగనన్న కాలనీలను జనసేన నాయకులు, కార్యకర్తలు సందర్శించి అక్కడి పనుల పురోగతి, మౌళిక వసతుల లేమి, లబ్దిదారుల ఇబ్బందులను పరిశీలించాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. ఇళ్లస్థలాల కోసం రూ.23,500 కోట్లు వెచ్చించి భూములు కొన్నారని... ఇందులో వందల కోట్లు చేతులు మారాయని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: