సింగపూర్‌ లోని అక్వేరియంకి వెళితే  ఆ అనుభూతి అనేది ఇంకో లెవెల్ లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ అక్వేరియం కింద నుండి కూడా మనం వెళ్లవచ్చు. అదే సందర్భంలో దుబాయ్ వెళ్లినప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో రెండు షాపులు ఉంటాయి. ఆ షాపుల మధ్యలో ఉన్న తలుపు తీసుకుని వెళ్తే లోపల విచిత్రంగా పెద్ద మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. ఆ మెట్రో స్టేషన్ పైకి చిన్నగా కనబడినా కిందకి వెళ్ళే కొద్దీ పెద్దగా ఒక అద్భుతమైన బ్రిడ్జి కనిపిస్తుంది . ఇప్పుడు ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు అలాంటి మార్పులే జరగబోతున్నాయి.


ఈశాన్య రాష్ట్రాలలో అనేక మార్పులు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. వాటిలో కీలకంగా అస్సాం లోని బ్రహ్మపుత్ర నది కింద జల గర్భ రోడ్ మరియు రైల్వే టన్నెల్ ని నిర్మించబోతున్నారట. అది కూడా వాటిని మూడు సమాంతర టన్నెల్స్ లా నిర్మించబోతున్నారని తెలుస్తుంది. 2 టన్నెల్స్ రోడ్డు లైన్స్ కోసం నిర్మిస్తూ ఉంటే, 1 టన్నెల్ మాత్రం రైల్వే లైన్ కోసం నిర్మించబోతున్నారట. దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా 7 వేల కోట్ల భారీ బడ్జెట్ అని తెలుస్తుంది.


ఒకరకంగా ఈ 9.8 కిలోమీటర్స్ పొడవైన ఈ టన్నెల్స్ అస్సాం ఇంకా అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న దూరాన్ని మరింతగా తగ్గించనున్నాయి. మౌలిక వస్తువుల కల్పనలో, ప్రత్యేకించి అక్కడ అభివృద్ధి విషయంలో, అది వాతావరణ సంబంధితం కానీ, మరొకటి గానీ ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత ఖర్చు పెట్టినా వృధానే అని అంతకుముందు ఉన్న పాలకులు వదిలేశారు. దాంతో అక్కడున్న వాళ్లు ప్రభుత్వంపై ఒక వ్యతిరేకతను పెంచుకున్నారు.


కానీ ఇప్పుడు అక్కడ విమానాశ్రయాలు కట్టిస్తున్నారు, ఐడల్స్ కట్టిస్తున్నారు, వాతావరణాన్ని తట్టుకునే టన్నెల్స్ ని కూడా కడుతున్నారు. ఇలాంటి వాటి ద్వారా ఆ ప్రాంతాలు కూడా భారతదేశంలో భాగమని ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఒక భరోసాని అందించినట్లుగా ఉంటుందని ప్రభుత్వ ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: