రాజకీయాల్లో అనుకోని అదృష్టం రెండుసార్లు కలిసి వచ్చింది పంచుమర్తి అనురాధకి. ఒకసారి గృహిణిగా ఉన్న ఆవిడ మేయర్ అయింది. ఇప్పుడు తాజాగా  ఎమ్మెల్సీ అయింది. రాజకీయాల్లో ఆవిడ అదృష్టవంతురాలు అయితే వైజాగ్ కు చెందిన గురువులు దురదృష్టవంతుడు అయ్యారని తెలుస్తుంది. ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ శివారాచర్య గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే ఆయనొక దురదృష్టవంతుడు.


2009లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు విశాఖ1 విశాఖ2 నియోజకవర్గాలు ఉండేవి. విశాఖ సిటీలో కాంగ్రెస్ తరపున ద్రోణంరాజు సత్యనారాయణ, టిడిపి తరఫున పల్లా సింహాచలం పెద్ద నాయకులు. అయితే 2009 నియోజకవర్గ పునర్విభజనలో విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏర్పడ్డాయి. విశాఖ సౌత్ తరపున ప్రజారాజ్యానికి సంబంధించి కోలా గురువులు, టిడిపి తరఫున వాసుపల్లి గణేష్, కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ పోటీ చేశారు.


గురువులు, గణేష్ ఇద్దరూ మత్స్యకార వర్గానికి చెందిన వాళ్ళు. వాడబలిజ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. హోరాహోరీ పోరులో రెండవ స్థానంలో ఉన్న ద్రోణం రాజు ఓటమి తప్పదని భావించి కౌంటింగ్ సెంటర్ నుండి వెళ్లిపోయారు కానీ చివరికి 341 ఓట్ల తేడాతో ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కోలా గురువులు మీద గెలిచారు. 2014లో వైసీపీ తరఫున కోలా గురువులు, గణేష్ టిడిపి, ద్రోణం రాజు కాంగ్రెస్ తరపున పోటీపడ్డారు.


అయితే గణేష్ గురువుల మీద 18 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత 2019లో ద్రోణం రాజు వైసీపీలోకి చేరి టిక్కెట్ ఎగరేసుకు పోయారు. గురువులు ద్రోణం రాజుకు మద్దతునిచ్చారు. కానీ గణేష్ దాదాపు నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. గురువుకు మొదట మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. 2009లో ఎమ్మెల్యేగా, మొన్న ఎమ్మెల్సీగా పక్కా గెలుపు అనుకున్న గురువును దురదృష్టం వేటాడింది. అది కూడా ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో  తెలిసిన వారు ఆయన్ని దురదృష్టవంతుడు అంటూ బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: