సూర్యరశ్మి తోనే ఈ భూమిపై ప్రాణికోటి అంతా మనుగడ సాగిస్తుంది. సూర్యరశ్మి లో ఉండే డి విటమిన్ వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అనేది వస్తుంది. కానీ అదే సూర్యరశ్మి దాని ఉష్ణోగ్రతలో మార్పులు పొందితే, అంటే అధిక ఉష్ణోగ్రతల్లోకి మారితే మాత్రం దాని ప్రభావం అనేది ఈ భూమిపై విపరీతంగా పడుతుంది. ఈ సూర్యుడి నుండి వెలువడే సూర్యరశ్మిని దాని తీవ్రతను ఫిల్టర్ చేయడానికి ఓజోన్ పొర ఈ మధ్యలో ఉంటుంది.


కానీ ఓజోన్ పొర అనేది కాలుష్యం వల్ల విచ్ఛిన్నమవుతూ వస్తూ ఉండడంతో సూర్యరశ్మి తీవ్రత రానున్న కాలంలో భూమిపై అధికంగా పడి, దాని తీవ్రత పెరిగే కొద్దీ చివరికి భూమంతా బూడిద అయిపోవడం తప్ప మరి ఏమి మిగలదని అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా వాళ్ళు చెప్పేది ఏంటంటే రానున్న రెండేళ్లలో ఎక్స్ట్రీమ్ వెదర్ రాబోతుందని దానివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వాళ్ళు అంటున్నారని తెలుస్తుంది.


ఉష్ణోగ్రతల‌ స్ధాయి పెరిగేకొద్దీ ప్రమాదం కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని, దీనివల్ల ఆస్ట్రోనాట్స్ బాగా ఇబ్బంది పడతారని, రేడియో కమ్యూనికేషన్ దెబ్బతింటుందని వాళ్లు అంటున్నారు. గతంలో 2012-14 మధ్యలో వచ్చిన ఈ అధిక ఉష్ణోగ్రతల సమస్య తిరిగి 2025 లో తిరిగి రాబోతుందని, దానివల్ల మొబైల్ నెట్వర్క్స్ దెబ్బతింటాయి, జిపిఎస్లు దెబ్బతింటాయి, ఇంటర్నెట్ కనెక్షన్లు కూడా దెబ్బతింటాయని, ఓజోన్ పొర దెబ్బ తినడం వల్ల పర్యావరణం కూడా దెబ్బతింటుందని అంటున్నారు.


ఆస్ట్రోనాట్స్ కి టెలికాం సంస్థలకి కూడా సమస్య వస్తుందని, కాకపోతే వీళ్ళకి సూర్యుడి పైన ఉండేటువంటి రోలర్స్ కాంతి పుంజాలను కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది, ఈ విధంగా వాళ్ళకి లాభాలతో పాటు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని, మిగతా జనాభా అంత ఆ రోజున, ఆ పరిస్థితులు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ ప్రతికూల పరిస్థితులను ఎదురుకోవడానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని వాళ్లు అంటున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

SUN