రాబోయే ఎలక్షన్లలో తమ విజయం ఖాయం చేసుకోవడానికి దాదాపు అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఒకే మంత్రాన్ని అవలంబించబోతున్నట్లుగా తెలుస్తుంది. మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్లలో అదే మంత్రం అక్కడ కాంగ్రెస్ ను గెలిపించింది అని తెలుస్తుంది. ఇప్పుడు అందరూ జపించే ఆ మంత్రం పేరే సంక్షేమం. నిజం చెప్పాలంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది.


ప్రజలకు ఇలా సంక్షేమ పథకాలు అనే పేరు చెప్పి డబ్బును దోచి పెడుతూ ఉంటే దేశం ఒక శ్రీలంక లాగా లేదా మరో వెనిజులా లాగా తయారవుతుందని ఆ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు వ్యాఖ్యానం చేశాయి. కానీ అలా వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా ఇప్పుడు సంక్షేమాల బాటనే పడుతున్నట్లుగా తెలుస్తుంది. కర్ణాటక ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలవడానికి కారణమైంది సంక్షేమ పథకాలే అని అంటారు.


దాంతో ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటేనే ఇష్టపడని భారతీయ జనతా పార్టీ కూడా సంక్షేమం వైపుగా చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దాని కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గ్యాస్ ను 500కే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర 500-600 రేంజ్ లోనే ఉండేది. కానీ మోడీ వచ్చిన తర్వాత గ్యాస్ ధరను మరొక 500 పెంచి ఈ 500మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సబ్సిడీలుగా ప్రజలకు ఇస్తూ ఉండేవి.


అయితే మధ్యతరగతి వాళ్ళు వెయ్యి రూపాయలు గ్యాస్ ధర భరించగలరు కాబట్టి ఈ సబ్సిడీని ఉప సంహరించుకోవాల్సిందిగా కొంత మంది గ్యాస్ యూజర్లను అడిగింది ప్రభుత్వం. దాంతో కొంతమంది ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత చూస్తే ప్రభుత్వమే ఈ సబ్సిడీని కూడా ఎత్తివేసింది. దాంతో గ్యాస్ ధర వెయ్యి రూపాయల నుండి ప్రస్తుతం 1100-1200 మధ్యన స్థిరమైంది. కానీ గెలుపు కోసం ఇప్పుడు బిజెపి గ్యాస్ ధరను తగ్గించే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP