కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, తీసుకుంటున్న చర్యలతో భారత్, కెనడా మధ్య సంబంధాలు చరిత్రలో లేనంతగా దిగజారాయి. ఖలిస్థాన్ టైగన్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ కెనడా మధ్య వివాదం రాజుకుంది.  తాజాగా ఈ అంశంపై అమెరికా స్పందించింది. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని దర్యాప్తు చేసేందుకు యత్నిస్తున్న కెనడా ప్రయత్నాలకు మద్దతిస్తున్నట్లు తెలిపింది.  ఇలాంటి కార్యకలాపాలపై ఏ దేశమూ ప్రత్యేకమైన మినహాయింపు పొందజాలదు. ప్రాథమిక సూత్రాల పరిరక్షణ విషయంలో రాజీ ఉండబోదు. రెండు దేశాలతో ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీనన్ పేర్కొన్నారు.


ఈ అంశం తమకు ఆందోళన కలిగిస్తోందని దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే.. గతంలో అమెరికాను నాశనం చేయాలని కుట్రలు పన్నిన బిన్ లాడెన్ ను పాకిస్థాన్ కి యుద్ధ విమానాలు పంపించి మరీ అతడిని తుద ముట్టించారు.  జవహర్ తో అమెరికాకు ప్రమాదమని భావించి లాడెన్  సంస్థకు సంబంధించిన అతడిని చంపేశారు. తమ దేశాన్ని నాశనం చేయాలని భావించిన వారందరనీ ఏ దేశంలో ఉన్నా  వెతికి వెంటాడి మరి అమెరికా చంపేసింది. అలాగే భారత్ వ్యతిరేక శక్తులు ఇండియాను నాశనం చేయాలని చూస్తున్నప్పుడు వారిని మన దేశం వాళ్లు ఎందుకు వదిలిపెట్టాలి. దీనికి అమెరికా మద్దతు అవసరం లేదు. మన అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యంతో పనేముంది.


ఫైవ్ ఐస్ అనే కూటమిలో అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఉన్నాయి.  ఇందులో కీలకమైన అంశం ఏమిటంటే నిజ్జర్ వ్యవహారంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికానే కెనడాకు సమాచారం ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ఏమీ తెలియనట్లుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎవరికీ భయపడే స్థితిలో లేదు. దేశ అంతర్గత వ్యవహారాలను భారతే చక్కబెట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: