మన రాజకీయ నేతలు ఏదైనా సర్వే తమకు అనుకూలంగా ఉంటే దానిని విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. అందులోని లోటుపాట్లను గమనించరు. ఉదాహరణకు గతంలో చంద్రబాబు మన రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. సంతృప్తి స్థాయి విపరీతం అంటూ ప్రతి సభలోను చెప్పేవారు. నా పాలనలో 97శాతం మంది ఆనందంగా ఉన్నారని.. దీనిని సంతోష సూచీ తెలిపిందని చెప్పేవారు. కానీ ఈ సర్వేలను నమ్మ వద్దని పలువురు సూచించారు. కానీ నమ్మలేదు. దాని ప్రభావం ఆ తర్వాతి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.


ఇప్పుడు ఏపీ సీఎం జగన్  మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేస్తున్నారని అనిపిస్తోంది.  ఆరోగ్య శ్రీ సేవలు చాలా బాగున్నాయని 99.71 శాతం రోగులు అభిప్రాయపడ్డారని వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఆరోగ్య శ్రీ బిల్లులు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో ఆయా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ కార్డు పేరు మీద రోగులను చేర్చుకోవడం లేదు. మరొక అంశం రోగి సహాయకుడికి ఆసుపత్రిలో ఉండేందుకు అవకాశం ఉండదు. రోగి మంచానికి మరో మంచానికి ఉండే స్థలంలో వాళ్లు పడుకోవాలి.  వీటితో పాటు ఆరోగ్య శ్రీ లో ఈ జబ్బుకు చికిత్స ఉంది కానీ డబ్బులు వచ్చే డబ్బులు సరిపోవు. అదనంగా మీరు చెల్లించాలి. లేకుంటే మేము ఆసుపత్రిలో చేర్పించుకోం  అని కొన్ని ఆసుపత్రుల వాళ్లు చెబుతున్నారు.


సకాలంలో బిల్లులు చెల్లించని కారణంగా కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశారు.  కానీ ఇటువంటి అంశాలను సర్వేల్లో అడగరు. వాళ్లను ఈ అంశాలపై ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆసుపత్రిలోకి వెళ్లి చికిత్స పొంది వచ్చిన వారికి సంతోషం కానీ ఈ లోపాలను సవరిస్తేనే వారికి ఉపయోగం. అంతేకానీ ఈ సర్వేలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్తే మాత్రం ప్రతికూల  ఫలితాలు ఎదురవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: