
ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. అలాంటి ఇమేజ్ ను రాజకీయాల్లో చంద్రబాబు సొంతం చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబుని పొగుడుతూ ఆయన శోభన్ లాంటి వారని.. ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియదు కానీ చంద్రబాబుకి మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉందని వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పటికీ చంద్రబాబు రాజకీయంగా విపరీమైన ప్రేమనే పొందుతున్నారు.
ఎలా అంటే ఏపీ లో ప్రస్తుతం టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అరెస్టు అయిన సందర్భంలో పవన్ పోరాటం చేసి టీడీపీ స్థానాన్ని ఆక్రమించవచ్చు కానీ.. చంద్రబాబు కోసం అడక్కుండానే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాగే కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఐ మద్దతు తెలిపింది. ఎటు తిరిగి తమ పంచన చేరనది ఒక్క భారతీయ జనతా పార్టీయే.
చంద్రబాబుకి ఐ లవ్ యూ కాదు వుయ్ లవ్ యూ అంటున్నాయి జనసేన, సీపీఐ లు. సీపీఎం కూడా రెడీగానే ఉంది. కాకపోతే ఆ పార్టీ బీజేపీతో వదిలేయాలని షరతు విధించింది. బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఇండియా కూటమి వైపు వచ్చినా.. రాకున్నా.. మద్దతు ఇస్తామని తెలిపారు. సీపీఐ మాత్రం బీజేపీ జోలికి వెళ్లొద్దు అలా అయితేనే మద్దతిస్తాం.. మీకు అమిత్ షా బెయిల్ ఇప్పించారు కాబట్టి బీజేపీ విషయంలో సానుకూలంగా ఉన్నారు. అంటే చంద్రబాబుతో కలిసి నడవడానికి సీపీఐ, సీపీఎం, జనసేనలు సిద్ధంగా ఉన్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే రాజకీయాల్లో చంద్రబాబు నిజంగా శోభన్ బాబే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.