ఎన్నికల నిర్వహణ, బలమైన వైసీపీని ఢీ కొట్టాలని చంద్రబాబు ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే భయం కూటమిని వెంటాడుతూ ఉంది. అందువల్ల  ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలను కనీసం ప్రచారానికి కూడా పిలవడం లేదు. అక్కడ బీజేపీ జెండాలు కూడా కనిపించడం లేదు.


తాజాగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు టీడీపీకి షాక్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి గతంలో టీడీపీకి ముస్లిం, మైనార్టీలు పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ ఆ పార్టీ బీజేపీతో జట్టు కట్టడంతో చాలా వరకు మైనార్టీలు దూరం అయ్యారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ ఆపార్టీకి చేరువ అయ్యారు.  2019కి వచ్చే సరికి ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు.


కానీ వైసీపీ కేంద్రంలోని బీజేపీతో స్నేహం కొనసాగించడంతో వారంతా మళ్లీ జగన్ కి దూరం జరగడం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ బీజేపీతో జట్టు కట్టింది. ఈ సమయంలో సంశయంలో ఉన్న మైనార్టీలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ ల ప్రకటనలతో గంపగుత్తుగా వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు.  మరోవైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా వైసీపీకే అనుకూలంగా మాట్లాడారు.


ఏపీ ప్రజలు జగన్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఎన్డీయే కూటమికి లేదు. వీరికి ఓటేస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఓవైసీ జగన్ కు ఓటేయాలని చెప్పి వైసీపీని  దెబ్బకొట్టాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినా చెప్పకున్నా మైనార్టీలు వైసీపీకే అనుకూలంగా ఉన్నారు. ఇలా చెప్పడం వల్ల హిందువులు సంఘటితం అయి.. టీడీపీ కూటమిని ఆదరించే అవకాశం ఉంది. తద్వారా వైసీపీకి భారీ నష్టం కలుగుతుంది. ఈ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: