
మాజీ మంత్రి అనిల్ కుమార్ మరోసారి నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ నెల్లూరు సిటీ నుంచి వరుస విజయాలు సాధించిన అనిల్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక గత ఎన్నికల వేళ జగన్ అనిల్‌ను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట ఎంపీగా పంపారు. అప్పట్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు స్థానిక నేతలతో అనిల్ కుమార్ యాదవ్ కు పొసగకపోవడంతో ఆయనను పార్లమెంటుకు పంపాలన్న ఉద్దేశ్యంతో నరసరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా జగన్ నిలబెట్టారు. మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లా రెడ్లు అనిల్‌ను ఇష్టపడలేదు. జగన్ రెడ్ల మాటను జవదాటలేక అనిల్‌ను బీసీ అస్త్రం.. యాదవ్ కోటా అంటూ నరసారావుపేట ఎంపీగా పంపారు.
ఎంపీగా ఓడిపోయిన అనిల్‌కుమార్ కొన్నాళ్ల నుంచి ఆయన మౌనంగా ఉంటున్నారు. ఎన్నికలు ముగిసి యేడాది అవుతోంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తన సొంత జిల్లాలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉండగా ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడిన అనిల్ సేవలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే వినియోగించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ సారి కూడా వైసీపీ రెడ్లు జగన్ మీద ఒత్తిడి చేసి నెల్లూరు సిటీ నుంచి అనిల్‌ను తప్పించేలా ప్రయత్నాలు మొదలు పెట్టేశారట.
అందుకే అనిల్‌ను వెంకటగిరి వైపు పంపాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రచారం బయటకు పొక్కిందో లేదో వెంకటగిరి వైసీపీ కేడర్ అనిల్ మా కొద్దు బాబోయ్ అంటూ ఎదురు తిరుగుతున్నారు. మాకు వెంకటగిరిలో నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డి బాగా కష్టపడుతున్నారని.. ఆయన ఆధ్వర్యంలోనే వెంకటగిరిలో వైసీపీ పటిష్టంగా ఉందని.. ఆయన స్వతహాగా సౌమ్యుడు, అందరిని కలుపుకుని పోతున్నారని .. ఆయన పక్కకు తప్పిస్తే నియోజకవర్గంలో పార్టీ నష్టపోవడం ఖాయమని వైసీపీ వాళ్లు చెపుతున్నారు. నెల్లూరు సిటీ వాళ్లు అనిల్ మాకొద్దని చెపుతుంటే.. అటు వెంకటగిరిలోనూ సొంత పార్టీ వాళ్లే అనిల్ గో బ్యాక్ అంటున్నారు. మరి అనిల్‌కు ఫైనల్‌గా జగన్ ఏ ప్లేస్ ఫిక్స్ చేస్తారో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.