
ఆయన జనసేనలో బుడిబుడి అడుగుల బాలరాజు అని అందరూ భావించారు. చాలా మంది ఎమ్మెల్యే టిక్కెట్ రాదు అన్నారు.. కానీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ కోసం ఓ సారి పోటీ చేసి ఓడిపోయారు.. ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని పోరాటం చేశారు... బాగా చదువుకున్నోడు... యువకుడు అలాంటోడిని ఎంకరేజ్ చేయకపోతే ఎలా ? అని నమ్మి సీటు ఇచ్చారు. పవన్ సీటిస్తే వైపీపీ కంచుకోటలో గెలుస్తాడా ? అంత సీన్ లేదని కొట్టి పడేశారు. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టి మరీ గెలిచాడు.. నూనుగ మీసాల నూతనత్వంతో కనిపించే ఆ జనసేన బాలరాజు ఇప్పుడు పెద్దరాజుగా.. మనసున్న మారాజుగా ప్రజల మనస్సులు గెలిచే దిశగా వెళుతున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
చిర్రి బాలరాజు జనసేనలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చాలా మంది ఆ పార్టీకి భవిష్యత్తు లేదని బయటకు వెళ్లిపోయారు. అయినా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలరాజు.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో రాజకీయాల్లో ఉంటే పవన్ కళ్యాణ్‌తోనే ఉంటా... నమ్మకంతో పని చేస్తా... లేకపోతే రాజకీయాలే చేయను అని కుండబద్దలు కొట్టేశారు. ఆ నమ్మకమే పవన్ గుర్తించారు. అందుకే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అప్పటికే ఐదు సీట్లు జనసేనకు ఇచ్చినా పట్టుబట్టి మరీ పోలవరం తీసుకుని బాలరాజుకు సీటు ఇచ్చారు.
బాలరాజు గెలవడు.... ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తా ? అని కొందరు చులకనగా, హేళనగా మాట్లాడారు. అప్పటి అధికార పార్టీ నుంచి కూడా ఇదే తరహా విమర్శలు, సెటైర్లు పడ్డాయి. అటు వైపు నాలుగుసార్లు ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. అయితే చిర్రి సంకల్ప బలానికి తోడు కూటమి కేడర్ బలం.. పవన్ నమ్మకం.. క్రేజ్ అన్నీ కలిసి చిర్రిపై ఉన్న అనుమానాలను చిత్తు చిత్తు చేసిపడేశాయి. ఫలితంగా బాలరాజు ఎమ్మెల్యేగా గెలిచి సగర్వంగా చిన్న వయస్సులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఎమ్మెల్యే అయితే సరిపోతుందా.. పాలన అనుభవం లేదుకదా..?
బాలరాజు ఎమ్మెల్యేగా గెలవకముందు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో.. గెలిచాక కూడా అవమానాలు తప్పలేదు. కనీసం గ్రామస్థాయిలో ఎప్పుడు గెలవలేదు... ఇలాంటోడు ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం ఏం చేస్తాడు ? అన్న ప్రశ్నలు వచ్చాయి. అలాంటి వాళ్లకు తన పనితీరుతోనే సమాధానం చెపుతూ బాలరాజు దూసుకు పోతున్నాడు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఉన్నత విద్యావంతుడు, యువకుడిగా తనకంటూ ఓ విజన్ ఉండడంతో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఏజెన్సీలో రహదారులు లేని మారుమూల గ్రామాలను గుర్తించి రహదారులు వేయిస్తున్నారు. అలాగే చాలా గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేకపోవడంతో తాగునీరు, కనీస మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏజెన్సీలో వందల గ్రామాల్లో కనీసం రహదారులు, తాగునీరు లేక ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. బాలరాజు వచ్చాక వాటిపైనే దృష్టి పెట్టి శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ పర్యటనకు జనసేన మంత్రి, పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ వచ్చినప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులే కాకుండా.. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ సమస్యలు చెప్పుకోవడం.. వాటిని బాలరాజు పరిష్కరిస్తోన్న తీరుకు ఆయన కూడా ఫిదా అయ్యారు. 9 నెలల్లో నియోజకవర్గ డవలప్‌మెంట్ చూసి మనోహర్ బాలరాజు పనితీరుపై ప్రశంసలు కురిపించారు.
ఎప్పటికప్పుడు ఇటు జిల్లా ఉన్నతాధికారులతో టచ్‌లో ఉంటూ నియోజకవర్గంలో సమస్యలు గుర్తిస్తూ... ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతోనూ కొన్ని పనులు చేయిస్తున్నారు. 9 నెలల్లో ఎమ్మెల్యేగా పరిణితి చూపించినా.. వ్యక్తిత్వంలో మాత్రం ఇంకా బుడిబుడి అడుగుల బాలరాజుగానే ముందుకు వెళుతున్నారు. ఏడు మండలాలతో పాటు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఉన్న ఈ నియోజకవర్గంలో కూటమి నాయకులను సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామే. అయినా బాలరాజు ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా ముందుకు వెళుతున్నారు. పోలవరం నిర్వాసితుల కాలనీల్లో సమస్యల పరిష్కారం కోసం చిర్రి బాలరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఇటు జిల్లా స్థాయి అధికారులు, అటు ప్రభుత్వ ఉన్నతాధికారుల సహకారంతో సమస్యలు పరిష్కారం విషయంలో చాలా చొరవ తీసుకుంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు