- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏదో ఒక అసంతృప్తి ఉంటూనే ఉంటుంది. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కల్వకుంట్ల కవిత తన తండ్రికి నేరుగా లేఖ రాయడంతో పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కవిత అమెరిక నుంచి రావడానికి ముందు రోజు కేసీఆర్ కు రాసిన లేక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె క్లారిటీ కూడా ఇచ్చారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారని వాళ్ళే ఆ లెటర్ లీక్ చేశారని కూడా కవిత ఆరోపించారు. దీంతో ఆ ద‌య్యాలు ఎవ‌రు అన్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట లేదు. ఇక‌ కవితలేఖ రాసి చాలాకాలం అయింది. అయితే ఆమె అమెరికా నుంచి రావడానికి ముందు రోజు బయటపడింది కాబట్టి ఇది కవిత ప్లాన్ అయి ఉంటుందా ? అని కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇదిలా ఉంటే తాజా ప‌రిణామాలపై కేసీఆర్ తన కుమార్తె ఇంటికి తనతో బంధుత్వం ఉన్న ఇద్దరు సన్నిహితులను పంపారట. వారు ఆమెతో కూడా మాట్లాడారని తెలుస్తోంది. కవిత తన భవిష్యత్తు పట్ల భయంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ ఓడిపోయి . . . గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని కవిత బలంగా నమ్ముతున్నారు. కెసిఆర్ సీఎం అవుతారు .. మళ్ళీ కేటీఆర్ మంత్రి అవుతారు .. వీలును బట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి కూడా కావచ్చు .. కానీ తన పరిస్థితి ఏమిటి ? అన్నదే ఆమెకు అంతు పట్టటం లేదట. ఆమెకు ఎమ్మెల్సీ ఇవ్వడానికే చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలోనే కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కాస్త డైల‌మా లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: