పండ్ల లో విశిష్టమైన స్థానాన్ని పొందిన వాటిలో అరటిపండు ఒకటి. అరటిపండును కేవలం తినడానికి మాత్రమే కాకుండా అనేక పూజలలో కూడా వాడుతూ ఉంటారు. నోములు మరియు వ్రతాల్లో అరటిపండుకు విశిష్టమైన స్థానం కూడా దక్కుతుంది. భగవతారాధనలో అరటి పండ్లు గొప్ప స్థానాన్ని పొందుతాయి. మరి అరటిపండుకి ఇంత విశిష్టమైన స్థానం దక్కడానికి గల కారణం ఏమిటో తెలుసా ..? దీని వెనుక ప్రచారంలో ఒక కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటి అనేది తెలుసుకుందాం.

దుర్వాసుడి అనే మహర్షికి కదళి అనే ఒక భార్య ఉండేది. దుర్వాసుడి మహర్షి కోపిష్టి. ఒక రోజు దుర్వాసుడి మహర్షి అలసటగా అనిపించి మధ్యాహ్నం పూట నిద్రపోయాడు. గాఢ నిద్రలోకి జారుకున్న మహర్షి సాయం కాలం వేలైనా నిద్ర నుండి బయటకు రాలేదు. సంధ్యా వందనానికి వేలైనా కూడా ఆ మహర్షి నిద్రలో నుండి బయటకు రాలేదు. కానీ ఒక వేళ అతన్ని నిద్రలో నుండి లేపినట్లైతే ఎక్కడ శపిస్తాడో అని ఆమె భయపడింది. కానీ ధర్మపత్నిగా తన కర్తవ్యాన్ని విస్మరించకూడదు అనే నిబద్ధతతో ఆ మహర్షిని నిద్రలేపింది. నిద్ర భంగం అయినందుకు ఆ మహర్షి ఆమెపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఆ మహర్షి కళ్ళల్లో కనిపించిన కోపాగ్నిని చూడగానే ఆమె భస్మం అయ్యింది. ఆ తర్వాత కొంత సమయానికి ఆలోచించి ఆయన ఎంతో కలత చెందాడు. అలాగే జరిగిన వైపరీత్యానికి ఎంతగానో దుఃఖించాడు. ఆ తర్వాత తన తపోబలాన్ని ఉపయోగించి కదళి భస్మరాశితో ఒక వృక్షాన్ని సృష్టించాడు. ఆ వృక్షమే కదళి వృక్షం. ఆ తర్వాత కొంత కాలానికి కదళి యొక్క తండ్రి ఆమెను చూడడానికి వచ్చాడు. కదళి తండ్రి శపిస్తాడు అని తెలిసిన కూడా నిజం దాచకుండా దుర్వాసుడి మొత్తం విషయాన్ని కదళి తండ్రికి చెప్పేసాడు. అలాగే తన చేసిన పనికి పశ్చాత్తాపంగా కదళి వృక్షాన్ని సృష్టించిన విషయాన్ని కూడా ఆయనకు తెలియజేశాడు. అలాగే ఈ వృక్షం యొక్క ఫలాలు భగవంతుని ఆరాధనలలో విశిష్ట ప్రాధాన్యతలను పొందుతాయి. నోములు , వ్రతాలు అరటి పండ్లు అద్భుతమైన స్థానాన్ని దక్కించుకుంటాయి అని కూడా చెప్పాడు. ఈ కథ ఆధారంగా అరటిపండుకి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: