బంగారం ధరలు ఈ మధ్యకాలంలో ఎలా ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆలా ఎందుకు పెరుగుతున్నాయి అంటే.. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి.. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యడంతో తులం బంగారం ధర నలబై ఐదు వేలకు చేరింది.

 

ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధర భారీ నుండి అతిభారీగా పడిపోయింది. మూడు రోజుల్లో ఏకంగా నాలుగు వేల రూపాయిలు బంగారం ధర పడిపోయింది. ఇప్పుడు పాత ధరలోనే కొనసాగుతున్నప్పటికీ బంగారం ధర రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 40వేలకు చేరింది. 

 

దీంతో నేడు బుధువారం బంగారం ధర ఎలా ఉంది అంటే? హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యరెట్ల బంగారం ధర 1,010 రూపాయిల పెరుగుదలతో 44,630 రూపాయలకు చేరింది. 22 క్యరెట్ల బంగారం ధర 1,007 రూపాయిల పెరుగుదలతో 41,007 రూపాయలకు చేరింది. ఇంకా ఈ నేపథ్యంలోనే వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కేజీ వెండి ధర 670 రూపాయిల పెరుగుదలతో 41,000 రూపాయలకు చేరింది. మరి ఈ బంగారం ధర చివరికి ఎంత ఉంటుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: