లవంగాలను  ఎక్కువగా మసాలా దినుసులుగా  మాత్రమే వాడుతాము, లేదా ఎప్పుడైనా పంటి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు, దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు ఒక లవంగాన్ని నోట్లో చేసుకుంటాం. కానీ లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసు ఉందాం.

 లవంగాలలో ఉండే యూజెనాల్ అనే రసాయన పదార్థం పంటి నొప్పిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను తగ్గించి, నోటిలోని బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుంది. అందుకే ప్రస్తుతం టూత్ పేస్ట్ తయారీ సంస్థలు ఎక్కువగా టూత్ పేస్ట్ లో లవంగాల పొడిని కలుపుతున్నారు.

తేనే,కొన్ని చుక్కలు లవంగాల నూనె ను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు,దగ్గు లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

వాంతులు,కడుపులో వికారంగా ఉన్నప్పుడు కూడా లవంగాలను తీసుకోవడం మంచిది.

తులసి,పుదీనా, లవంగాలు, యాలకులు అన్నీ మిశ్రమం చేసి,టీ లా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించడమే కాక మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు.వీటిలో చక్కెర,బెల్లం లకు బదులుగా  తేనెను మాత్రమే ఉపయోగించండి.

లవంగాలను పొడి చేసి నీళ్లలో కలిపి ఆ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్ తగ్గి ఉపశమనం కలుగుతుంది.

ఉదయం పూట నిద్ర లేచేటప్పుడు అనారోగ్యంగా అనిపిస్తే,పది- పన్నెండు లవంగాలను తీసుకొని వాటికి చక్కెర,పసుపు పొడి కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు మంచి  నీళ్లలో వేసుకొని తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండవచ్చు.

క్రమం తప్పకుండా లవంగాన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల వృద్ధిని పెంపొందించడానికి లవంగం ఎంతగానో సహాయపడుతుంది.

శ్వాస సంబంధిత వ్యాధులకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. లవంగాలను ఆహారంలో కాని, పొడి చేసుకొని నీటిలో కాని కలిపి  తీసుకోవడం వల్ల  శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.ఈ విధంగా చేయడం వలన కొంతమేరకు ఆరోగ్యంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: