మునగాకు తీసుకొని అందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకనివ్వాలి. మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ప్రతిరోజు రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రెండు స్పూన్లు తింటే మగవారిలో వీర్య వృద్ధి చెందుతుంది. అంతేకాకుండా శీఘ్ర స్కలనం సమస్య తగ్గడమే కాకుండా, లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
అరటి పండు తినడం వల్ల కూడా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అరటి పండులో ఉండే బ్రోమోలైన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. పురుషులలో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా అరటి పండులో ఉండే పొటాషియం, విటమిన్ బి శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తాయి.
కోడి గుడ్డు లో విటమిన్ b5, విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్నాయి. ఇవి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. అంతేకాకుండా లైంగిక వాంఛను కలిగిస్తాయి.
అశ్వ గ్రంధి శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ శృంగార శక్తి పెరగడానికి భారతీయ ఆయుర్వేదంలో దీనిని ఎక్కువగా వాడుతారు.
చిటికెడు పల్లేరు కాయల చూర్ణాన్ని, 1 స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని, కప్పు పాలలో బాగా మరిగించి వడపోసుకొని పడుకోబోయే ముందు తాగడం వల్ల మగవారిలో లైంగిక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా పది లేదా పదిహేను రోజులు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి