ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో జీవన శైలి ఎంతగానో మారింది. అది మన జీవితంపై ఎంతగానో ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మన ఆరోగ్యంపై రసాయనాలతో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, అలాగే ప్రజలను తన వైపుకు తిప్పుకునే ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కలిసి మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. వీటి వలన వచ్చే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. తగిన వ్యాయామం లేకపోవడం కూడా ఇందుకు ఇక కారణం అనే చెప్పాలి. చిన్న వయసు లోనే చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు, తమ బరువును తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. చాలా మంది ఎంత ప్రయత్నించినా బరువు అస్సలు తగ్గరు.

అయితే సులువుగా మీ బరువు తగ్గించుకోవడానికి నిపుణులు చెబుతున్న చిట్కాలు పాటిస్తే తప్పకుండా ఫలితం ఉందని అంటున్నారు. అవేంటో ఇపుడు చూసేద్దాం పదండి.

పొద్దున్నే లేచిన వెంటనే చాలా మందికి కాఫీలు టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీర బరువును పెంచుతాయి తప్ప తగ్గడానికి సహాయపడవు.  

* శరీర బరువు తగ్గించుకోవడానికి ఉదయాన్నే పర గడుపున గోరు వెచ్చటి నీటిని తాగాలని చెబుతున్నారు. లేదా వేడి నీటిలో చిటికెడు పసుపు కలిపి తాగినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

* ఆవాల నూనె శరీర బరువును తగ్గించడంలో ఆరోగ్యాన్ని సంరక్షించడంలో చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే  ఒమేగా - 3, ఒమేగా - 6 కొవ్వు ఆమ్లాలు జీవ క్రియను మెరుగు పరుస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. ఈ ఆవ నూనె వలన శరీర బరువు కూడా బాగా తగ్గించుకోవచ్చు. అలాగే రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా శరీర బరువును తగ్గిస్తుంది.

పై విధంగా క్రమం తప్పకుండా చేసినట్లయితే కొద్ది కాలంలోనే మీరు మంచి మార్పును గమనిస్తారు. ఏదైనా ముందు స్టార్ చేసి ఫలితం పొందితే మళ్ళీ మీరు దానికి అలవాటు పడుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: