దీంతో ఎంతో మంది ఉద్యోగులు సంతోష పడిపోయారు. ఇక ఇంటి నుంచి హాయిగా పని చేసుకోవచ్చు అని భావించారు కానీ.. కొన్ని రోజుల్లోనే ఆఫీసులో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం స్నేహితులు లాంటివి ఇంట్లో ఉండవు అని భావించి ఇక వర్క్ ఫ్రం హోం పై విరక్తి చెందారూ. ఇక ఇప్పుడు కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రం హోం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు లాప్టాప్ ద్వారా వర్క్ చేస్తూ ఉన్నారు. అంతే కాదు ఒక చోట కూర్చుని పని చేయడం కాదు తమకు ఇష్టమైన చోట కూర్చొని ఇక ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని కూడా పని చేస్తూ ఉన్నారు.
ఒకవేళ మీరు కూడా అలా లాప్టాప్ ను ఒడిలో పెట్టుకుని పని చేస్తే ఇక ఇప్పటి తో అలా చేయడం ఆపడం మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయట. లాప్టాప్ ఒడిలో పెట్టుకోవడం వల్ల దాని వేడి మహిళలకంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుందని పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత దెబ్బతింటుందట. దీంతో సంతానోత్పత్తి సమస్యలు కూడా వస్తాయట. ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్డ్రైవ్ నుంచి విడుదల అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. దీని వల్ల నిద్రలేమి తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయట. నిరంతరం లాప్టాప్ వినియోగించడం వల్ల కూడా కండరాల నొప్పి వస్తుందట..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి