బొప్పాయి క్యాబేజి సలాడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా బొప్పాయి, క్యాబేజితో చేసే ఈ సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. మనం అల్పాహారంగా తీసుకోవడానికి లేదా రాత్రి భోజనంగా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది.ఈ సలాడ్ ను తినడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. దీనిని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి చాలా మేలు కలుగుతుంది. అలాగే ఈ సలాడ్ ను తయారు చేయడం చాలా సులభం. కేవలం 5 నిమిషాల్లోనే మనం ఈ సలాడ్ ను తయారు చేసుకోవచ్చు. కమ్మని రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ బొప్పాయి క్యాబేజి సలాడ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఇక బొప్పాయి క్యాబేజి సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు..నూనె  ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి  2, క్యాబేజి తరుగు ముప్పావు కప్పు, పచ్చి బొప్పాయి తరుగు ముప్పావు కప్పు, ఉప్పు  తగినంత, వేయించిన పల్లీల పొడి  2 టేబుల్ స్పూన్స్, దానిమ్మ గింజలు పావు కప్పు, తరిగిన కొత్తిమీర  2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం  ఒక టీ స్పూన్ తీసుకోవాలి.


బొప్పాయి క్యాబేజి సలాడ్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా మీరు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి.ఆ తరువాత ఆవాలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.తరువాత క్యాబేజి తురుము ఇంకా పచ్చి బొప్పాయి తురుము వేసి కలపాలి. దీనిని ఒక 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇక ఇలా వేయించిన తరువాత ఉప్పు, పల్లీల పొడి వేసి కలపాలి. దీనిని మరో నిమిషం పాటు అలాగే వేయించి ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దానిమ్మ గింజలు, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. దీనిని వేడి వేడిగా తింటే ఖచ్చితంగా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బొప్పాయి, క్యాబేజితో సలాడ్ ను చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: