
కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అందువల్ల అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్ ను ధరించాలని, ఎవరికి వారు ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ శుభ్రం పాటించాలని తెలిపింది. అయితే భారతదేశంలో పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా కేసులు పెరిగి మళ్ళీ ప్రమాదం ముంచుకువస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను మట్టి కల్పించే దిశకై సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కేరళలో 253 కరోనా కేసులు ఉన్నాయి. అలాగే తమిళనాడులో 66 కేసులు నమోదు అవ్వగా.. మహారాష్ట్రలో 56 కేసులు ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీలో 23 కేసులు, కర్ణాటకలో 36 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా లక్షణాలు చూసినట్లయితే.. తాజా వేరియంట్ లు ఎక్కువగా గొంతు పై ప్రభావం చూపిస్తున్నాయి. దీని కారణంగా ఎక్కువగా పొడి దగ్గుతో బాధితులు ఇబ్బంది పడుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకి కూడా వచ్చే అవకాశం ఉందట. కానీ బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు కరోనా భారీనా పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కరోనా వచ్చిన సాధారణమైన లక్షణాలు అనుభవిస్తారని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు భయపడకుండా ఉండాలని సూచిస్తున్నారు.