కాఫీలో ఉండే కెఫిన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో పరిశోధనలు తెలియచేస్తున్నాయి. అయితే దీనికి భిన్నంగా కాఫీ వల్ల మన గుండె మరింత ధృడంగా మారి మన దెబ్బతిన్న మన హృదయ కండరాలు వాటంతట అవే సద్దుకునేలా కాఫీ సహాయ పడుతుందని ఈ మధ్య లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఒక జర్మన్ అధ్యయనం తెలియచేస్తోంది. 
Is Coffee Good For Heart Health? Heres What Researchers Found
అంతేకాదు 4 కాఫీ కప్పులలో ఉండే కాఫీ తీసుకోవడం వల్ల కెఫీన్ 'p27' అని పిలువబడే ప్రోటీన్ను ప్రేరేపింప బడటంతో ఇది గుండె కణాల పునరుత్పత్తికి సహాయపడుతూ మన గుండెను రక్షించడంలో ఈకాఫీ ఎంతో సహాయ పడుతుందని జర్మనీ దేశపు లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ముఖ్యంగా కాఫీలో ఉండే కెఫీన్ వల్ల గుండె యొక్క ధమని సిరల ఆరోగ్య సామర్ధ్యం మరింత మెరుగుపడుతుందని ఈ అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. 
కెఫిన్ డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-
అంతేకాదు కెఫిన్ టైప్ 2 డయాబెటిస్ ను నియంత్రిచడంలో కూడ సహాయపడుతుందని ఈ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. స్విస్ శాస్త్రవేత్తల మరొక అధ్యయనం ప్రకారం డయాబెటిస్ రోగులకు తరుచూ వచ్చే మూత్ర పిండాల వ్యాధి నుండి కాఫీలోని కెఫీన్ పదార్ధం రక్షించి శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తి పెంపొందిస్తుందని మరి కొన్ని అధ్యయనాలు తెలియ చేస్తున్నాయి. 
ధమనులకు తక్కువ క్యాల్షియంను మాత్రమే కాఫీ అందివ్వగలదు :-
అదేవిధంగా వృద్ధాప్యంలో వృద్ధులు ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది కాబట్టి కాఫీ వృద్ధులకు అవసరమైన ఆహారంగా పనిచేస్తుందని యూరప్ దేశాలలోని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనితో వృద్ధులలో గుండె పనితీరును మెరుగు పడటమే కాకుండా వారు జీవితం దీర్ఘకాలం పాటు సాఫీగా జీవించే విధంగా కాఫీ సహకరిస్తూ వృద్ధులకు అదనంగా రక్షణాత్మక ఆహారంగా మారుతుందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. దీనితో ఇప్పటి వరకు కాఫీ త్రాగడం అనారోగ్యాలకు మూలం అంటూ జరిగిన ప్రచారం రూపు మారి ఆరోగ్యానికి మేలు చేసే కాఫీ అంటూ పెద్దపెద్ద కాఫీ కంపెనీలు ప్రకటనలు ఇచ్చేరోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.. I

మరింత సమాచారం తెలుసుకోండి: