కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. దీని వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏకంగా ప్రపంచమే లాక్‌ డౌన్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచంలో చాలా దేశాలతో పాటు భారత్ కూడా లాక్ డౌన్ అయ్యింది. 21 రోజుల పాటు ఇల్లు కదిలే అవకాశం లేదు.

 

 

దీంతో చాలా మంది తలపట్టుకుంటున్నారు. కానీ ఇందులో కూడా చాలా పాజిటివ్ దృక్కోణం ఉంది. ఇన్నాళ్లూ ఉరుకుల పరుగుల జీవనంతో మనం అసలు మన జీవితాల్లో ఏం జరుగుతుందో వెనక్కి తిరిగి చూసుకోవడమే మర్చిపోయాం. మన మానవ సంబంధాలను గాలికొదిలేశాం.. చుట్టాలు, బంధువుల సంగతి పక్కకు పెట్టండి. కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడపడం తగ్గించేశాం.

 

 

అలాగే మన జీవితంలో ఎన్నో అనుకున్నాం.. ఉద్యోగం కోసం, కేరీర్ కోసం మన అభిరుచులకు ఇన్నాళ్లు సమయం కేటాయించలేకపోయాం.. ఇప్పుడు అలాంటి వాటికి సమయం కేటాయించండి. ఫోన్ ద్వారా అయినా సరే ఆత్మీయులను పలకరించండి. కాస్త ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.

 

 

ఇన్నాళ్లు సమయం లేక పెండింగ్ పడిన అంశాలను గుర్తు తెచ్చుకోండి. వాటిని ఇప్పుడు సాధించుకోండి. అసలు మీ జీవితాన్నే మీరు సమీక్షించుకోండి. మీ లక్ష్యం ఏంటి.. ఏ దిశగా వెళ్తున్నారు.. ఎక్కడ గాడి తప్పారు.. ఇప్పుడు ఏం చేయాలి.. తీరిగ్గా సమీక్షించుకోండి. ఏమంటారు..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: