జీవితంలో ఎవరైనా ఎదగాలనే అనుకుంటారు. అవును నిజమే. కానీ.. అసలు మీ గురించి మీకు పూర్తిగా అవగాహన ఉందా.. ? మనల్ని మనం పరిశీలించుకోవడమే ఆత్మపరిశీలన. చాలామంది ఈ విషయం పట్ల శ్రద్ధ చూపరు. మనం తప్పు చేయం’ అనుకోకూడదు. మనమూ తప్పులు చేస్తాం అన్న విషయం మనం నమ్మాలి.

 

 

 

అద్దంముందు నిలబడి అందాన్ని పరిశీలించుకుని, శరీరానికి మెరుగులు దిద్దుకుంటాం. కానీ... అలాగే మన మాట, చేతల విషయంలోనూ పరిశీలన అవసరం. ఎవరికి వారు తమ లోపాలను గుర్తించలేకపోవచ్చు. ఎదుటివారు వేలెత్తి చూపినప్పుడు ఆగ్రహించకుండా, తనను తాను తరచి చూసుకుతీరాలి. ఎవరైనా సరే.. తనలోకి తాను తొంగి చూసుకోగలిగితే చాలు.. మనల్ని మనం దిద్దుకోవడం సులభం.

 

 

మనలో చాలా మందికి ఇలాంటి కంప్లయింట్లు ఉంటాయి. ఛీ.. పాడు లోకం.. ఎవడూ నా బాధ పట్టించుకోరు.. నన్ను అర్థం చేసుకోరు. నా మనసు బాధ ఎవడికీ అవసరం లేదు. నేను చెప్పేది ఒక్కరూ వినరు.. మనకు తరచూ ఇలాంటి కంప్లయింట్లు చేసే వాళ్లు చాలా మంది కనిపిస్తారు. మిగిలిన వాళ్ల సంగతి ఎందుకు.. మీకు కూడా ఇలా చాలాసార్లు అనిపించి ఉంటుంది కదూ.

 

 

నిజమే.. ఈ ఫిర్యాదులో వాస్తవం ఉంది. మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది.. అది చెబితే మీరే షాకవుతారు.. అసలు మిమ్మల్ని మీరే అర్థం చేసుకోవడం లేదు. మీ బాధలను మీరే పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇక ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు చెప్పండి. అవునా కాదా..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: