జీవితం ఓ భోగం.. దీన్ని అనుభవించాలి. జీవితపు ప్రతి మలుపునూ ఆస్వాదించాలి. అన్ని బంధాల్లోనూ మమతానురాగాలు ఉన్నాయి.. వాటిని ఆనందించాలి.. అన్ని పనుల్లనూ ఆనందం వెదుక్కోవాలి..ఇదే జీవితాన్ని ఆనందంగా ఉంచే మార్గం.

 

 

అయితే ఇక్కడ ఓ విషయాన్ని అస్సలు మరచిపోకూడదు. అదే అసలైన రహస్యం. మనం జీవితాన్ని ఆనందించే ప్రతి క్షణంలోనూ ఇది అశాశ్వతం అన్న స్పృహ ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే.. తామరాకుపైన నీటిబొట్టులా మన జీవితం సాగిపోవాలి. తామరాకు మీద నీటి బొట్టును ఎప్పుడైనా చూశారా.. అది అటూ ఇటూ హాయిగా కదులుతూనే ఉంటుంది.

 

 

అయితే అది ఎక్కడా తామరాకుకు అంటుకోదు. మనమూ అలాగే బతకకలగాలి. అంటే..భార్య, బిడ్డలు, హితులు, స్నేహితులు, సిరిసంపదలు.. అన్నింటినీ ఆస్వాదించాలి. కానీ అదే సమయంలో ఇవేవీ మనకు శాశ్వతం కాదన్న స్పృహ ఉండాలి. అంటే కాళ్లు తడవకుండానే సముద్రాన్ని దాటాలి. జీవన్ముక్తి వివేకంతో మనిషి సంసార సాగరాన్ని ఈదాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: