దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ మల్తాని మట్టి,రెండు టీ స్పూన్ల బంగాళదుంప గుజ్జు,ఒక స్పూన్ కలబంద గుజ్జు,ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని అరగంటసేపు బాగా నానబెట్టిన తరువాత,ఇప్పుడు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని అప్లై చేసి అరగంట సేపు ఆరనివ్వాలి.ఇది బాగా ఆరిన ముఖాన్ని మెల్లగా రుద్దుతూ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.ఆ తరువాత ఆయిల్ ఫ్రీగా ఉండే మాయిశ్చరైసర్ని రాయడం మాత్రం కంపల్సరీ.
ఇందులో వాడిన రోజ్ వాటర్ చర్మంపై ఉన్న రంద్రాలను శుభ్రం చేసి,అనవసరమైన జిడ్డును తొలగించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది.మరియు ముల్తానీ మట్టి చర్మంపై ఉన్న ఆయిల్ గ్లాన్డ్స్ ని రిపేర్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.ఈ చిట్కా పొడి చర్మం కలవారు ఉపయోగించాలి అంటే రోజు వాటర్ బదులుగా పెరుగు కానీ,పాలు కానీ వేసి కలుపుకోవడం ఉత్తమం.మీరు కూడా మొండి జిడ్డుతో బాధపడుతూ ఉంటే ఈ చిట్కా తప్పక వాడి నెల రోజుల లోపు జిడ్డు,మచ్చలు,మొటిమలు లేని మెరుగైన ముఖాన్ని పొందండి.
దీనితో పాటు మొహం డిహైడ్రేట్ కాకుండా తగిన మోతాదులో నీరు తీసుకోవడం కూడా తప్పనిసరి. మరియు మనం తినే ఆహారం,జీవన శైలి కూడా మన అందాన్ని డిఫైన్ చేస్తాయి.కావున మీరు తప్పకుండా పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ,యోగా ఎక్సర్సైజ్ వంటి అలవాటు చేసుకోవడం ఉత్తమం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి