
ఇది శరీరానికి సులభంగా జీర్ణమై రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. యానీమియా ఉన్నవారికి ఇది అద్భుతమైన ఆహారం. ఇది కళ్ల ఆరోగ్యానికి, చర్మ కాంతికి, ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతానికి ఉపయోగపడుతుంది. ఒంట్లో కణాల పునరుద్ధరణకు కూడా సహాయపడుతుంది. నాడీ వ్యవస్థకు అవసరమైన బి12 విటమిన్ చికెన్ లివర్‌లో అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో శిశువు మెదడు ఎదుగుదలకి అవసరమైన ఫోలేట్ ఇందులో లభిస్తుంది. శరీర బలానికి, కండరాల అభివృద్ధికి, శరీర క్షీణత తగ్గించడానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. చికెన్ లివర్‌లో ఉన్న ప్రోటీన్ శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది.
చికెన్ లివర్ సృష్టించే కొలెస్ట్రాల్ మితంగా తీసుకుంటే శరీరానికి అవసరమైన కొవ్వు అందుతుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చికెన్ లివర్‌లో విటమిన్ A అధికంగా ఉండటం వల్ల మితిమీరిన వాడకం వల్ల హైపర్‌విటామినోసిస్ A అనే స్థితి వస్తుంది. తలనొప్పి, చర్మం పొడిపోవడం, వాంతులు, లివర్ మీద ఒత్తిడి. చికెన్ లివర్‌లో చక్కెరలు తక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ డిసీజ్ ఉన్నవారు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. చాలా ఎక్కువ విటమిన్ A తీసుకోవడం గర్భస్థ శిశువుకు హానికరమవుతుంది. గర్భిణీలు వాడేముందు వైద్యుల సలహా తీసుకోవాలి.