జ్ఞాపకశక్తి అంటే మన మెదడు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది చదువుకునే విద్యార్థులకు, వయసు మీద పడుతున్న వారికి, ఉద్యోగస్తులకు — ప్రతీ ఒక్కరికీ ఎంతో కీలకమైన విషయం. మన ఆహారపు అలవాట్లే మెదడును పదును పెట్టడంలో, జ్ఞాపకశక్తిని పెంచడంలో చాలా ప్రభావం చూపుతాయి. బాదంలో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది మెదడుకు ఎనర్జీ ఇస్తుంది. రోజూ 5-6 బాదంను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది న్యూమోనియా, అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధులకు ముప్పును తగ్గిస్తుంది. వాల్‌నట్ ఆకారమే మెదడుకు పోలికగా ఉంటుంది. ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

రోజుకు రెండు లేదా మూడు తినడం మెమొరీ పెరగడానికి సహాయపడుతుంది. అరటిలో గ్లూకోజ్ ఉంటుంది. ఇది మెదడు శక్తిని తక్షణం పెంచుతుంది. పరీక్షల సమయంలో లేదా పని ఒత్తిడి ఉన్నప్పుడు తినితే శక్తి వస్తుంది. పొటాషియం అధికంగా ఉండటంతో నాడీమండలాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది. అండాలు, ముఖ్యంగా పచ్చసొనలో ఉండే చోలిన్ మెదడు నరాలకు అవసరం. ప్రతి రోజు 1 గుడ్డు తినడం ఉత్తమం. ఇవి యాంటీ ఆక్సిడెంట్లలో రిచ్. మెదడును స్ట్రెస్ నుండి కాపాడతాయి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం ఆలస్యమవుతుంది. ఫిష్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.

మెదడు అభివృద్ధికి, మెమొరీ పెరగడానికి సహాయపడతాయి. శాకాహారులకు నువ్వులు లేదా ఫ్లాక్స్ సీడ్స్ ఉత్తమ ప్రత్యామ్నాయాలు. బ్రాహ్మి ఆకు / బ్రాహ్మి సారం, ఇది ఆయుర్వేదంలో మెదడు శక్తిని పెంచే ఔషధంగా ప్రసిద్ధి పొందింది. మానసిక ఒత్తిడిని తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. దీనిని కషాయంగా లేదా బ్రాహ్మి లేహ్యం రూపంలో తీసుకోవచ్చు. పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి మెమొరీ పెరుగుతుంది. అవకాడో, హెల్తీ కొవ్వులు కలిగి ఉండే ఈ పండు మెదడు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: