గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. డైరక్ట్‌గా వైసీపీ కండువా కప్పుకోకుండా, తమ పదవులకు రాజీనామా చేయకుండా, జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి చెందినవారే. అలా వైసీపీ వైపుకు వెళ్ళిన ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి కూడా ఒకరు.


ఈయన ఒకప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో కీలకంగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో గిరి...గుంటూరు ఈస్ట్‌లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి చంద్రబాబు, గిరికి వెస్ట్ సీటు ఇచ్చారు. వెస్ట్‌లో టీడీపీకి మంచి బలం ఉంది. అందుకే గిరి మంచి మెజారిటీతోనే వెస్ట్‌లో గెలిచారు. కానీ ఊహించని విధంగా గిరి తర్వాత వైసీపీ వైపుకు వెళ్లారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక, అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలోనే గిరి వైసీపీలోకి వెళ్లారు.


అంటే మూడు రాజధానులకు మద్ధతుగా గిరి వచ్చారనే కోణంలో రాజకీయం నడిచింది. అలా వైసీపీలోకి వచ్చిన గిరికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందిలేదు. నిధులు బాగానే అందుతున్నాయి. నియోజకవర్గంలో బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బంది రానివ్వడం లేదు. కాకపోతే గతంతో పోలిస్తే గుంటూరు నగరంలో ఇప్పుడు అభివృద్ధి తక్కువగా జరుగుతుంది. పైగా గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీని గెలిపించిన ప్రజలపై పన్నుల భారం పెరిగింది. ఆస్తి, చెత్త మీద పన్నులు పెరిగాయి. ఈ పన్నుల అంశం కాస్త వైసీపీకి మైనస్ అయ్యేలా ఉంది.


రాజధాని విషయంలో కూడా గుంటూరు ప్రజలు అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది. కాకపోతే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి గిరికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అటు టీడీపీ తరుపున కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. ఈయన యాక్టివ్‌గానే నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో గిరికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ టికెట్ గిరికే దక్కే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో గిరి మీద ఓడిపోయిన చంద్రగిరి యేసురత్నంకు గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ పదవి ఇచ్చారు. అటు లేళ్ళ అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ దక్కింది. దీంతో వెస్ట్‌లో మద్దాలికి వైసీపీ మద్ధతు పెరిగింది. మరి గెలుపు వస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎన్నికల వరకు వెయిట్ చేయాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: