ఒకప్పటిలాగా హీరోలు అంటే ఓన్లీ సినిమాలే చేయడం లేదు ప్రస్తుతం.. సినిమాలు చేస్తూనే పాలిటిక్స్, మార్కెటింగ్, బిజినెస్, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు హీరోలు కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు. టాలీవుడ్‌లో కమర్షియల్ యాడ్స్‌లో ఎక్కువగా కనిపిస్తున్న స్టార్ హీరోస్‌లో ఒకరు ప్రిన్స్ మహేశ్ బాబు. ఇలా ప్రకటనలతోనే బోలెడంత ఆదాయం సంపాదించేస్తున్నారు సూపర్ స్టార్ మహేశ్. బాలీవుడ్ హీరోలతో కలిసి కూడా యాడ్ చేస్తున్న మహేశ్, ఇప్పటికే సోలోగా పలు యాడ్స్‌లో కనిపించారు. ఇకపోతే కమర్షియల్ యాడ్ చేసినందుకుగాను మహేశ్ రెమ్యునరేషన్ సుమారు రూ.ఐదు నుంచి పది కోట్లు తీసుకుంటారని తెలుస్తోంది. 

‘థమ్సప్, సంతూర్, బైజూస్, డెన్వర్’ వంటి బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ వాటి ద్వారా ఏడాదికి దాదాపుగా రూ.5 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కామర్స్ ప్లాట్ ఫాం ఫ్లిప్‌కార్ట్‌కు కూడా మహేశ్ బ్రాండింగ్ చేస్తున్నారు. మొత్తంగా సినిమాలు చేస్తూనే కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు మహేశ్. ఈ యాడ్స్ ప్రమోషన్స్ వల్ల మహేశ్ సెలబ్రిటీ స్టేటస్ ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌లో కనిపించడం ద్వారా మహేశ్‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుందని మహేశ్ అభిమానులు పేర్కొంటున్నారు. మహేశ్ చివరగా తెలుగు ప్రేక్షకులకు ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన పరశురామ్ డైరెక్షన్‌లో ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్రం తర్వాత మహేశ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తారట. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి, కబీర్‌సింగ్’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: