టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  నిఖిల్ సిద్ధార్థ్ 'హ్యాపీ డేస్'  మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  హ్యాపీ డేస్ మూవీ ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఆ తర్వాత మాత్రం  ఆ రేంజ్ విజయాలను అందుకోవడం లో కాస్త ఎక్కువ సమయం పట్టింది అని చెప్పవచ్చు,  హ్యాపీ డేస్ సినిమా తర్వాత వరుస పరాజయాలను బాక్స్ ఆఫీస్  ఎదుర్కొన్న నిఖిల్ సిద్ధార్థ  'స్వామి రారా'  మూవీ ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు.  ఆ తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ , ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలు కూడా మంచి విజయాలను సాధించడంతో నిఖిల్ సిద్ధార్థ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మారిపోయాడు,  ఇది ఇలా ఉంటే నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం 18 పేజిస్ అనే  మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. 

 ఈ సినిమాకు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది,  ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను చిత్ర బృందం బయటకు వదిలింది.  18 పేజెస్ సినిమా వీడియో గ్లిమ్ప్స్ ని ఏప్రిల్ 6 వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది,  GA2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే నిఖిల్  సిద్ధార్థ్ ఈ సినిమాతో పాటు కార్తికేయ 2  సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు,  ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది,  నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: