స్టార్ హీరోల తో సమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు సమంత..ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చింది.సమంత తో ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.యు టర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆమె మంచి ఫలితాలందుకుంది..అఆ, మజిలీ లాంటి సినిమాల విజయంలో ఆమె పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. వరుస సినిమాలు హిట్ అవ్వడంతో హీరోలకు మించి స్టార్‌డమ్‌ని అందుకుంది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజిగా ఉంది.


పెళ్ళి అయినా కూడా వరుస సినిమాలలో చేసిన సామ్ ఇప్పుడు సినిమాల స్పీడ్ ను తగ్గించింది. విడాకుల తర్వాత కొంచెం డీలా పడింది. పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఓ ఊపు ఊపెసింది.. దాంతో సామ్ మళ్ళీ ఫుల్ బిజీ అవుతుందని అందరు అనుకున్నారు. కానీ అలా జరగలేదు.తమిళంలో ఆమె ముఖ్య పాత్ర పోషించిన 'కాదువాకుల రెండు కాదల్' సినిమా తెలుగులోకి 'కణ్మణి రాంబో ఖటీజా' పేరుతో అనువాదం అయింది. నయనతార, విజయ్ సేతుపతిలకు కూడా తెలుగులో మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, సినిమాకు హైలెట్ మాత్రం సమంతనే.


సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.తన సినిమాను సమంత తెలుగులో ప్రమోట్ చేసుకోలేదు. ఈ సినిమా బాగా ఆడితే అది సమంతకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. శాకుంతలం, యశోద లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ముందు ఈ చిత్రం వల్ల కొన్నాళ్లు సమంత వార్తల్లో ఉంటుంది.కేఆర్కేలో' సమంత టిపికల్ క్యారెక్టర్ చేసినట్లుంది. ఆ పాత్రకు తగ్గట్లు గ్లామర్ విందు చేసినట్లు కూడా కనిపిస్తోంది. సామ్ ఎందుకు సైలెంట్ గా ఉందో ఎవరికీ అర్థం కాలేదు..అసలు సమంతకు ఏమైంది అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: