
తాజాగా రాహుల్ రామకృష్ణ తమ ట్విటర్ నుంచి ఈరోజు మధ్యాహ్నం.. హైదరాబాద్ మునిగిపోయింది మీ వాగ్దానాలన్నీ కూడా విఫలమయ్యాయి.. @KCRBRSPRESIDENT ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ రెండు గంటలలోనే సుమారుగా 98 వేలకు పైగా వ్యూస్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షాలు, వరదల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీలను ఏవి ఫలించడం లేకపోవడంతో పరోక్షంగా ఇలా విమర్శిస్తున్నట్లు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే ఉదయం మరొక ట్విట్టర్లో మనం చాలా భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము.. వేచి ఉండలేను వచ్చిన పరిస్థితుల్ని చక్కదిద్దాలి అంటే కేటీఆర్ రావాల్సిందే అంటూ పిలుస్తూ.. "నన్ను చంపేయండి నాకు ఏమీ ఆశ లేదు అంటూ బాగోద్వేగంగా పోస్ట్ ని షేర్ చేశారు". ఈ పోస్ట్ కూడా క్షణాలలో వైరల్ గా మారింది. ఇవే కాకుండా ఎన్నో సందర్భాలలో కూడా ఆయన స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం విన్న కొంతమంది నెటిజెన్స్ రాహుల్ గారు మీకు ఏమయింది? ఎందుకు ఇప్పుడు కెసిఆర్, కేటీఆర్ ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కమెడియన్ ఎలా స్పందిస్తారో చూడాలి.