భారతదేశంలో గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి , అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఇండియా లోనే గొప్ప దర్శకులలో ఒకరిగా పేరును తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలో గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా పోన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగం కొన్ని రోజుల క్రితమే తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ ,  జయం రవి ,  ఐశ్వర్యా రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. మంచి అంచనాలను నడుమ విడుదల అయిన ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. కాకపోతే తెలుగు లో మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ లో  మాత్రమే కలక్షన్ ను రాబట్టింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రేంట్ పద్ధతిలో అందుబాటు లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు నుండి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ కస్టమర్ లకు ఫ్రీ గా అందుబాటు లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ కస్టమర్ లు ఎవరైనా ఈ మూవీ ని చూడాలి అనుకుంటే ఈ రోజు నుండి అనగా నవంబర్ 4 వ తేదీ నుండి ఫ్రీ గా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: