మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో బాబీ డైరెక్ట్ చేసిన సినిమా వాల్తేరు వీరయ్య. శృతి హాసన్ చిరంజీవికి జంటగా నటించింది. ఈరోజు ఈ సినిమా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే..వైజాగ్ లోని జాలర్ల పేటలో ఉంటూ తన చుట్టూ ఉన్న తన వాళ్లకు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉంటాడు వీరయ్య అలియాస్ వాల్తేరు వీరయ్య (చిరంజీవి).విలన్ సోలోమన్ (బాబీసింహా) అనే డ్రగ్ మాఫియా లీడర్ ను పట్టుకోవడం కోసం సహాయం చేయమని ఇన్స్పెక్టర్ (రాజేంద్రప్రసాద్) కోరడంతో మలేసియా దేశం వెళతాడు.కానీ ట్విస్ట్ ఏంటంటే..వీరయ్య మలేసియా వచ్చింది ఇన్స్పెక్టర్ కోసం సోలోమన్ ను పట్టుకోవడానికి కోసం కాదని, తన అన్నయ్య అయిన మైఖేల్ (ప్రకాష్ రాజ్) కోసమని తెలుస్తుంది.అసలు మైఖేల్ కి ఇంకా వీరయ్యకి ఉన్న గొడవ ఏమిటి? ఈ స్టోరీలో అసిస్టెంట్ కమిషనర్ విక్రమ్ సాగర్ (రవితేజ) పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 'వాల్తేరు వీరయ్య' సినిమా మీరు థియేటర్ లో చూడాల్సిందే.


మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్స్, మ్యానరిజమ్స్ మళ్ళీ ఈ వీరయ్య పాత్రలోనే కనిపించాయి. మెగాస్టార్ అభిమానులు మిస్ అవుతున్న డ్యాన్సులు కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇక యాక్షన్ బ్లాక్స్.. ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఇంకా ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేసిన తీరు అయితే ఖచ్చితంగా థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ అయితే ఈ సినిమాకే పెద్దగా ప్లస్ పాయింట్ గా నిలిచింది.అలాగే రవితేజ స్క్రీన్ ప్రెజన్స్ ఇంకా ఎనర్జీ అదిరిపోయాయనే చెప్పాలి. చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ ఇంకా సెంటిమెంట్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మాత్రం ఎప్పటిలాగా శ్రుతిహాసన్ గ్లామర్ కి పాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా.. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండడం ప్లస్ అయ్యింది. బాబీ సింహా విలన్ గా చాలా బాగా ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, మెయిన్ విలన్ అయినప్పటికీ.. బాబీ సింహానే హైలైట్ అయ్యాడు.మొత్తానికి ఈ సంక్రాంతికి అందరూ ఎంతగానో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: