చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయి తే జనాలు ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ లను నమ్ముకు నే వారు . సినిమా లేదా సీరియల్ , న్యూస్ ఇలా దేనినైనా టీ వీ లోనే చూస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వర కు మారాయి. ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ కోసం జనాలు యూట్యూ బ్ పై ఆధార పడుతున్నారు. ఇక యూట్యూబ్ కూడా కం టెంట్ క్రియేట్ చేసే వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తూ ఉండడంతో చాలా మంది యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులను సంపాదిస్తున్నారు. దానితో ఇండియాలో అనేక మంది యూట్యూబ్ ద్వారా డబ్బులను సంపాదించేవారు ఉన్నారు. ఇక చాలా మంది యూట్యూబ్ వల్ల టీవీ లను చూడడం కూడా తగ్గించేశారు. యూట్యూబ్ లోనే న్యూస్ చానల్స్ , ఎంటర్టైన్మెంట్ అనేక విషయాలు అందుబాటులో ఉండడం తో చాలా మంది యూట్యూబ్ నే వాడుతున్నారు.

ఇక ఇండియా లోకి జియో వచ్చిన తరువాత యూట్యూబ్ వాడకం సంఖ్య భారీగా పెరిగింది. చాలా మంది జియో సిమ్ వారు ఇంటర్నెట్ సౌకర్యాలను అత్యంత చవకగా ఇస్తుండడంతో యూట్యూబ్ లోనే అనేక రకాలైన కంటెంట్ ను వీక్షిస్తున్నారు. ఇకపోతే ఇండియాలో యూట్యూబ్ ద్వారా డబ్బులను సంపాదిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. యూట్యూబ్ ద్వారా అనేక మంది ఉద్యోగ అవకాశాలను కూడా పొందినట్లు తెలుస్తోంది. యూట్యూబ్ ఇండియాలో అనేక అద్భుతాలను సృష్టిస్తున్నట్లు , యూట్యూబ్ ద్వారా ఎంతో మంది భారతీయులు ఇప్పటికే ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకున్నట్లు , అలాగే భారతీయులు యూట్యూబ్ ద్వారా అనేక రకాలైన విషయాలను , టెక్నాలజీని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా యూట్యూబ్ ప్రస్తుతం భారత్ లో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నట్లు చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: