తెలుగు ఇండస్ట్రీలో అవేరేజ్ గా చూసుకుంటే యాక్షన్ సినిమాలను అభిమానించేవారు ఎక్కువ.ఇటీవల వచ్చిన సినిమా విక్రమ్ ఆ మూవీలో ఉన్న సీన్స్, హీరో ఎలివేషన్స్ అలాగే సంగీతం బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాన్ని చూసిన మన తెలుగు ప్రేక్షకులు అటువంటి మువీని మన తెలుగు హీరోల్లో ఏవరైనా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా సమయంలో ఇటీవల విడుదల ఐనా మన విక్టరీ వెంకటేష్ సినిమా యొక్క గ్లింప్స్ బట్టి మాస్ ప్రేక్షకుల కోరిక నెరవేరినట్లుంది అనిపించేలా ఉంది. ఐతే దానికి సంబంధిచిన వీడియో ఇపుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

ఐతే ఈ గ్లింప్స్ లో కనబడ్డ వెంకటేష్ ని చూసి అభిమానులు షాక్ కి గురి అయ్యారు. ఎందుకంటె వెంకటేష్ ఈ విధంగా మాస్ క్యారెక్టర్ చేసి చాలా సంవత్సరాలు గాడిచాయి. ఆయన ఒకప్పుడు తీసిన గణేష్ సినిమా సూపర్ హిట్ ఐనా సంగతి తెల్సిందే. కాకపోతే ప్రేక్షకులు వెంకటేష్ అనగానే గుర్తొచ్చేవి ఫ్యామిలీ మరియు ఎమోషనల్ సినిమాలే. ఆయన చాలా సినిమా రీమేక్ చేసారు ఐనసారే అవి అసలు రీమేక్ లాగా అనిపించవు. ఆయన సినిమాలు కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మరీ చేస్తారు. ఐతే ఇపుడు ఆయన చేయబోయే సినిమా మీద చాలా ఫోకస్ పెట్టారు ఎందుకంటె ఆయన లైఫ్ లో ఇపుడు చేయబోయే మూవీ అనేది డె బ్బయి ఐదు వ సినిమా అందుకే దీన్ని చాలా ప్రతిష్టత్మకంగా తీస్తున్నారు. ఐతే డానికి సంబంధించిన సినిమా శీర్షిక మరియు గ్లింప్స్ ఇవాళ విడుదల చేసారు.

ఐతే ఈ సినిమాకి సైంధవ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఆయన దీంట్లో ఆ టైటిల్ కి తగ్గట్టుగా మాస్ లుక్ లో కనబడ్డారు. ఆ గ్లింప్స్ లో ఆయన చేతిలో తుపాకీ పట్టుకొని యమ సీరియస్ గా బండి మీద కాలు పెట్టి నిలబడి ఉన్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు సినిమా అనేది ఎలా ఉండబోతుందని. మాస్ అభిమానులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ ఉన్నట్ట్లు తెలుస్తుంది.ఈ సినిమా కి డైరెక్టర్ గా శైలేష్ కొలను అని తెలుస్తుంది. ఆయన ఈ మధ్య తీసిన ‘హిట్ 2’ సినిమా అనేది ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఐతే ఈ పోస్టర్ ను చూస్తున్న వెంకటేష్ అభిమానులు మాత్రం తెగ హ్యాపీగా గా ఫీల్ అవుతున్నారు. తన అభిమాన స్టార్ హీరో ను ఈవిధంగా మాస్ గెట్ అప్ లో చూసి చాలా కాలం యింది అని వాళ్ళు చెబుతున్నారు. దీనికి సంబంధిచిన ఇన్ఫర్మేషయిన్ అనేది ఇంకా బయటకి రాలేదు.అభిమానులు చాలా ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: