రాజమౌళి కొడుకు కార్తికేయ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అమెరికాలో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని ఆస్కార్ అవార్డ్ ల రేస్ లో నిలబెట్టడానికి అందరు అనుకుంటున్నట్లుగా తాము 80 కోట్లు ఖర్చు పెట్టలేదనీ మొత్తం తమ టీమ్ ఖర్చుపెట్టిన ఖర్చులు అన్నీ లెక్కలోకి తీసుకుంటే 8.5 కోట్లకు మించి ఉండదు అంటూ అతడు చేసిన కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ కొందరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.


‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ కోసం రాజమౌళి సుమారు రెండు నెలల పాటు అమెరికాలో ఉండటమే కాకుండా అక్కడి హాలీవుడ్ మీడియాకు పార్టీలు ఇస్తూ ఎంతో ఖర్చు పెట్టిన విషయం కార్తికేయ మర్చిపోయాడ అంటూ కొందరు జోక్స్ వేస్తున్నారు. మరికొందరైతే 8.5 కోట్లకు బదులు 8.5 లక్షలు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పి ఉంటే మరింత బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు.


హాలీవుడ్ మీడియా ఒక ఇండియన్ సినిమా ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఆమూవీని ప్రశంసిస్తూ వార్తలు రాయదని అలాంటి హాలీవుడ్ మీడియాను మేనేజ్ చేయాలి అంటే ఎంతో తెలివితేటలతో పాటు ఖర్చు కూడ భారీగా ఉంటుంది అన్నవిషయం కార్తికేయకు తెలియదా అంటూ మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి కుడి భుజంలా అన్ని విషయాలు చూసుకుంటూ జక్కన్నకు కొంతవరకు శ్రమను తగ్గిస్తున్న కార్తికేయను రాజమౌళి భారీ సినిమాలు తీసే నిర్మాతగా మార్చాలని ఆలోచనలు చేస్తున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.


సాధారణంగా ఒక సినిమా సెలెబ్రెటీ ఇంటిలో ఒకరు తప్పితే ఇద్దరు అదే రంగానికి చెందినవారు ఉంటారు. అయితే రాజమౌళి కీరవాణి కుటుంబం మొత్తం ఒక యూనిట్ గా ఏర్పడి జక్కన్న తీస్తున్న సినిమాల గురించి పడుతున్న కష్టం వల్ల కూడ రాజమౌళికి ఈ స్థాయిలో అదృష్టం పేరు వచ్చింది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. మహేష్ రాజమౌళి తీయబోతున్న సినిమా తరువాత జక్కన్న తీసే సినిమాలు అన్నింటికీ అతడే నిర్మాతగా వ్యవహరిస్తాడు అన్న అంచనాలు కూడ వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: