టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీ లీల ఒకటి కాదు రెండు కాదు  బోలెడన్ని సినిమాలో నటిస్తోంది. మొదటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .ఈ సినిమాతో ఆమె దిశతిరిగిపోయింది .ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్ ఈమె అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఆ ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం కావట్లేదు.. 

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాను.. కనుక నేను ఈ పాత్రలే చేయాలి అని డిమాండ్ చేయడం లేదు.. నాకు నచ్చిన పాత్రలను నేను చేస్తాను.. అలాగే సినిమాలో ఆ పాత్ర ఎంత ఉండాలి ఎలా ఉండాలి అని అసలు డిమాండ్ చేయను అంటూ చెప్పుకొచ్చింది శ్రీ లీల. ఇక మహేష్ బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ కు ఈమె ఓకే చెప్పిన సంగతి మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటు బాలకృష్ణ అనిల్ రావిడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలు సైతం  ఒక కీలకపాత్రలో నటిస్తోంది. ఇక ఆ సినిమాలో శ్రీ లీలా బాలకృష్ణకి కూతురుగా కనిపించబోతోంది. అయితే ఈ యంగ్ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం నటించడానికి రెడీగా ఉన్నట్లుగా ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది.

అంతేకాదు వారం రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా షూటింగ్ లేకుండా ఖాళీగా లేను అంటూ వెల్లడించింది ఈమె. అంతేకాదు ఒక్కరోజు కెమెరా కనబడకపోయినా ఏదో వెలితిగా ఉంటుంది అంటూ చెప్పింది .మొత్తానికి శ్రీ లీలా తన కెరీర్ లో ఎంత బిజీగా ఉందో క్లారిటీ ఇచ్చింది. ముందు హీరోలను చూసి మొదటి రెండు మూడు రోజులు సినిమాకి వస్తారు.. అందుకే ఒక స్టార్ హీరో సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించడం తప్పేమీ కాదు.. అంటూ క్లారిటీ ఇచ్చింది.ఏదేమైనా ఈమె  ఇంత క్లారిటీగా ఉండడంతో భవిష్యత్తులో ఈమె కెరియర్ చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. లేనిపోని స్టార్డం ను ఉందని ఊహించుకొని ఇప్పుడున్న చాలామంది స్టార్ హీరోయిన్లు  సినిమాలు చేస్తే  ఈ హీరోయిన్ మాత్రం అందరిలాగా కాకుండా నచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: