మనలో కొంతమందికి డబ్బు సంపాదించడం తెలిస్తే, మరి కొంత మందికి ఆ డబ్బును ఆదా చేయడం తెలుస్తుంది. కానీ డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కరికి ఆదా చేయాలని ఉంటుంది. కానీ కొన్ని కారణాల చేత వారు ఆదా చేయలేకపోతారు . అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని మార్గాల ద్వారా డబ్బును ఆదా చేయవచ్చు. అయితే ఆ మార్గాలు  ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మనలో చాలా మంది బ్యాంకు ఖాతాలో డబ్బు ఉందంటే చాలు ఎక్కువగా, ఇష్టానుసారంగా ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఆ వస్తువు అవసరం లేకపోయినా సరే, కొంతమంది అప్పు చేసి మరీ కొనుగోలు చేసి , చివరికి అప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇక కొన్ని ఈ - కామర్స్ వెబ్ సైట్ లు విడుదల చేసే ఆఫర్లకు ఎక్కువగా ఆకర్షితులై, షాపింగ్ చేసే వారు రోజురోజుకు పెరిగిపోతున్నారు. షాపింగ్ అనేది నెలకొకసారి లేదా ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తే సరిపోతుంది. కానీ ప్రతి వారం  అనవసరంగా ఇలాంటివి కొనుగోలు చేస్తే ఇబ్బందులు పడక తప్పదు.


ముఖ్యంగా ఇలాంటి సమయంలోనే కేవలం నెల రోజులు నియమాన్ని పాటిస్తే సరిపోతుంది. భవిష్యత్తులో కూడా మంచి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నియమం ఉపయోగపడవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ 30 రోజుల పద్ధతిని పాటించండి. అంటే 30 రోజుల వరకూ  ఆ వస్తువును కొనుగోలు చేయడానికి వాయిదా వేస్తే, ఇక తిరిగి 30 రోజుల తర్వాత కూడా మీకు ఆ వస్తువు అవసరం అనిపిస్తేనే కొనుగోలు చేయండి. లేకపోతే ఆ వస్తువుకు  సమానమైన డబ్బులు దాచుకోవచ్చు.


సాధారణంగా చాలా మందికి ఈ పద్ధతి నచ్చకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలో డబ్బు ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ నియమం మంచి లాభాలను అందిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారో అలాంటి వారు కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సరి కొత్త స్కీమ్ లలో డబ్బులు ఆదా చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: