కేంద్ర ప్రభుత్వం ఇటీవల సరికొత్త కార్మిక చట్టాలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే వీటిని అమలు చేసేందుకు సర్వత్ర సిద్ధం చేసుకుంటోంది కేంద్రం. అయితే సాధారణంగా వచ్చే నెల నుంచి ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. అయితే కచ్చితంగా వచ్చే నెల నుంచి ఈ కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తాయా..లేక మరి కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.. కొత్త వేజ్ కోడ్ కూడా అమలులోకి వస్తే , సెలవు పనివేళలు, పీఎఫ్, వేతనం వంటి అంశాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని పలువురు పలు రకాలుగా తమ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు..

అయితే ఇటీవల కొత్త వేజ్ కోడ్ ప్రకారం .. ప్రస్తుతం కార్మిక ఉద్యోగులకు ఉన్న 9 గంటల పనివేళలు .. 12 గంటలకు పెరగనున్నాయి.కానీ వారానికి మూడు రోజులు సెలవు దినాలుగా ప్రకటించడం జరిగింది.. అంటే కార్మిక చట్టం ప్రకారం ఏడు రోజులకు 48 గంటలు ఫ్రీ రూల్స్ కూడా అమల్లోకి వస్తాయి.. ఈ నేపథ్యంలో కార్మిక ఉద్యోగుల రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేస్తే, వారానికి మూడు రోజులు సెలవు తీసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనల ప్రకారం బేసిక్ సాలరీ పెరుగుతుంది.. అలాగే టేక్ హోమ్ సాలరీ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. ఇక సి టి సి ప్రకారం బేసిక్ సాలరీ లో 50 శాతం కన్నా తక్కువ ఉండకూడదు..

నిజానికి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు అలవెన్సులు ఎక్కువిస్తే ,బేసిక్ సాలరీ తక్కువగా ఇస్తుంటాయి.. కొత్త చట్టాలు అమలులోకి వస్తే, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అలాగే బేసిక్ సాలరీ కూడా పెరుగుతుంది. ఇకపోతే ఇంటికి తీసుకెళ్లి శాలరీ మాత్రం తగ్గవచ్చని కొత్త రూల్స్ చెబుతున్నాయి . అంతేకాకుండా ఈ కోడ్ అమలులోకి రావడం వల్ల ఉచితంగా మెడికల్ చెకప్ వంటి ప్రయోజనాలు కూడా అందుతాయి.. ఇక ఓవర్ డ్యూటీ చేసే వారు కూడా 15 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు ఎప్పుడు పని చేసినా కూడా 30నిమిషాలు గానే పరిగణిస్తారు. ఇక ఈ కొత్త కార్మిక చట్టాలు చాలా ప్రయోజనకరంగా మారనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: