రైతులను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. గత కొన్ని సంవత్సరాలు క్రితం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ఇప్పటికే ఎంతోమంది రైతులు ఆర్థిక భరోసాను పొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలో రూ. 6000 జమవుతున్నాయి. ఏడాదికి మూడు విడతల చొప్పున ప్రతి విడుదలకి 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతా లో జమ కానుండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు ఈ పథకంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక దరఖాస్తుకు సంబంధించిన అంశాలు .. కొత్త నియమాలు.. ప్రణాళికలు.. అర్హతలు ఇలా ఎన్నో అంశాలు ఈ పథకంలో చేర్చబడడం గమనార్హం.


ఇకపోతే భార్యాభర్తలిద్దరూ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చా ?లేదా? అనే విషయాలు.. మారిన నియమాల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. ఇకపోతే పీఎం కిసాన్ పథకం నియమాల ప్రకారం భార్యాభర్తలిద్దరూ కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందే ఆస్కారం లేదు. ఒకవేళ పీఎం కిసాన్ నగదు పథకం ద్వారా డబ్బులు పొందితే ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వం రికవరీ చేస్తుంది. అంతేకాదు వారి ఖాతాను ఫేక్ అకౌంట్ కింద మారుస్తుంది అని సమాచారం. ఇకపోతే ఈ పథకం ద్వారా అర్హులు కాని వారు నగదు పొందితే వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఇకపోతే తాజాగా తీసుకొచ్చిన కొత్త నియమాల ప్రకారం రైతు కుటుంబంలో ఎవరైనా సరే పన్ను చెల్లిస్తూ ఉంటే వారికి ఈ స్కీం కింద బెనిఫిట్స్ లభించవు. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరిలో ఎవరైనా పోయిన ఏడాది ఆదాయపు పన్నులూ చెల్లించి ఉంటే వారు ఈ ఏడాది ఈ పథకానికి ప్రయోజనం పొందలేరు. ఒక రైతు తన వ్యవసాయ భూమిని వ్యవసాయం కోసం ఉపయోగించకుండా ఇతర పనులకు ఉపయోగిస్తూ లేదా ఇతరుల పొలాల్లో వీరు వ్యవసాయం చేస్తున్నట్లయితే ఆ రైతుకు పిఎం కిసాన్ ప్రయోజనాలు లభించవు. ఇక అంతే కాదు ఒక రైతు వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఆ వ్యవసాయ భూమి అతడి తండ్రి ,తాత పేరు మీద ఉన్నా కూడా అతడికి ఈ స్కీం ద్వారా ప్రయోజనాలు వర్తించవు. ఇక సొంత భూమి ఉండి కూడా ప్రభుత్వ ఉద్యోగం, పదవీ విరమణ , మాజీ ఎంపీ , మంత్రి , ఎమ్మెల్యే , ఇంజనీర్లు , డాక్టర్లు , లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు లాంటివారు కుటుంబ సభ్యులుగా ఉన్నా సరే వారు ఈ పథకానికి అనర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి: