ప్రస్తుతం ఉన్న కాలంలో డబ్బు సంపాదించాలంటే ఎక్కువగా ఉద్యోగాలే చేయాల్సిన పనిలేదు.. కాస్త ఆలోచించి పని చేస్తే మరెన్నో అవకాశాలు సైతం లభిస్తాయి.. కూర్చున్న చోటు నుంచి కొన్ని లక్షల రూపాయల్లో సైతం సంపాదించుకోవచ్చు. మనం ఇంట్లో ఉండే ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే మంచి లాభాలను అందుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి లక్షల రూపాయలను సైతం సంపాదించే బిజినెస్లు ఉన్నాయి. చిన్న వ్యాపారంతో అధిక లాభాన్ని పొందే వ్యాపారాల గురించి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


1). తక్కువ ధరతో బ్రెడ్ తయారీ వ్యాపారాన్ని సైతం ప్రారంభించడం మంచిది.. రూ.10,000 రూపాయల తో ఈ వ్యాపారాన్ని సైతం ప్రారంభించడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు. ఈ బ్రెడ్ తయారు చేయడానికి కావలసినవి రొట్టె, మైదా పిండి లేదా గోధుమపిండి ఉప్పు, చక్కెర, బేకింగ్ పౌడర్ ,మిల్క్ పౌడర్ తదితరవి అవసరం ఉంటాయి.


2). మరొక బిజినెస్ చాక్ పీసుల తయారీ ప్రారంభం.. వీటికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి సులభంగా మొదలు పెట్టుకోవచ్చు. స్కూల్ కాలేజీలకు చాక్పీసులు కచ్చితంగా అవసరం ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అతి తక్కువ సమయంలోనే భారీ డబ్బును సంపాదించుకోవచ్చు.


3). ఏవైనా గ్రీటింగ్ కార్డ్స్ లేదా ఫంక్షన్లకు ఈ మధ్యకాలంలో డబ్బులను ఎన్వలఫ్ కవర్లలో పెట్టి ఇస్తున్నారు.ఇలాంటి వాటికే కాకుండా ఎన్నో రకాల వాటికి ఎన్వలప్ కవర్లు ఉపయోగిస్తున్నారు.. ఈ ఎన్వలప్  కవర్ల వ్యాపారాన్ని సైతం ప్రారంభిస్తే పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఉండదు.. కాబట్టి ప్రతి నెల కచ్చితంగా రూ .30 వేల రూపాయలను సులభంగా పొందవచ్చు. ఇదే కాకుండా డైరీ సంస్థలు.. పాల ప్యాకెట్ల రూపంలో బిజినెస్లను ప్రారంభించిన మంచి లాభాలను సైతం పొందవచ్చు. వీటన్నిటికీ కూడా తక్కువ పెట్టుబడి అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: