వెరైటీ సినిమాలను తీసి మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని నిర్మాతగా  మధురా శ్రీధర్ చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే అతడి ప్రయత్నాలకు బలం చేకూర్చే సరి అయిన హిట్ ఇంకా అతడికి రాలేదు అన్నది వాస్తవం. ఈ పరిస్థుతులలో ప్రముఖ ఛానల్  టీవీ 9 తో పార్టనర్ షిప్ చేస్తూ మెగా డాటర్ నిహారికను హీరోయిన్ గా చేసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు నిర్మాత మధురా శ్రీధర్. 

మెగా ఫ్యామిలీ డాటర్ హీరోయిన్ కాబట్టి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం భారీగా ఉండాలని ఆ శించి చిరంజీవి నుండి మెగా కుటుంబ హీరోలు అందర్నీ ఈ ప్రారంభోత్సవ వేడుకకు పిలిచి ఈసినిమా ఓపెనింగ్ ను అత్యంత ఘనంగా చేద్దామని ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ కు మెగా కుటుంబం నుండి అనుకోని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

‘బ్రూస్ లీ’ పరాజయం తరువాత చిరంజీవి ఇంకా ఆ సినిమా షాక్ నుండి తేరుకొని నేపధ్యంలో ప్రస్తుతం తనను నిహారిక సినిమా ప్రారంభ ఫంక్షన్ కు రమ్మని బలవంత పెట్టవద్దని సున్నితంగా తిరస్కరించినట్లు ఫిలింనగర్ గాసిప్. చిరంజీవి ఇలా అనడంతో మెగా కుటుంబంలోని ఇతర హీరోలు కూడ రకరకాల కారణాలు చూపెడుతూ మెగా డాటర్ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కు రాకుండా తప్పించుకుంటున్నారని వార్తల హడావిడి వినిపిస్తోంది. 

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా నిహారిక మొట్టమొదటి సినిమాను చాల ఘనంగా ప్రారంభించి సినిమా షూటింగ్ మొట్టమొదటి రోజు నుండే బయ్యర్లలో క్రేజ్ సంపాధించుకుందామని ఈసినిమా నిర్మాత మధుర శ్రీధర్ చేసిన ప్రయత్నాలు ఆదిలోనే బెడిసికొట్టాయి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా కుటుంబ క్రేజ్ తో తొలి సినిమా అయినా  భారీ పారితోషికం కొట్టేసిన నిహారిక సినిమా ఓపెనింగ్ మాత్రం సాదాసీదాగా జరిగే అవకశాలు మాత్రమే ఉన్నాయి అని ఫిలింనగర్ టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: