‘భలే భలే మగాడివోయ్’ సూపర్ సక్సస్ తరువాత నాని నటిస్తున్న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో వేడుక నిన్న అత్యంత ఘనంగా జరిగింది. మహేష్ బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుకలో ఈసినిమా దర్శకుడు హను రాఘవపూడిని టార్గెట్ చేస్తూ నాని చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. ఈసినిమా కథను మొదట తనకు వినిపించడానికి దర్శకుడు హను రాఘవపూడి కలిసి నప్పుడు తిరిగి గతంలో అతడు తీసిన ‘అందాల రాక్షసి’ కథ లాంటిది చెపుతాడు అనుకుంటే మరొక డిఫరెంట్ కథ చెప్పి తనను ఆశ్చర్య పరిచాడు అంటూ ఒకవైపు దర్శకుడు హను రాఘవపూడిని పొగుడుతూనే మరొక వైపు అతడి పై సెటైర్ వేసాడు.
ఈ సినిమా కోసం ఈ దర్శకుడు పడ్డ కష్టాన్ని చూస్తే తనకు మైండ్ బ్లాంక్ అయింది అని అంటూ ఈ సినిమా షూటింగ్ లో హను రాఘవపూడికి గాయాలు అయినా పట్టించుకోకుండా అతడు పడ్డ కష్టాన్ని చూసినప్పుడు ఇటువంటి సినిమా పిచ్చి వాళ్ళు కూడ ఉంటారా అని తనకు అనిపించింది అని నాని ఆ దర్శకుడి పై చనువుగా వేసిన సెటైర్ కు ఆ వేడుకకు వచ్చిన చాలామంది ఆశ్చర్య పోయారు. అంతేకాదు నాని దర్శకుడి పై సెటైర్లు వేసే స్థాయికి ఎదిగి పోయాడు అంటూ ఆ వేడుకకు వచ్చిన కొంతమంది కామెంట్స్ చేసుకున్నారు.
ఈ సందర్భంలో అతిథిగా వచ్చిన మహేష్ ఈసినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థతో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ఇంత మంచి మనసున్న నిర్మాతలను తాను ఎక్కడా చూడలేదు అని కామెంట్ చేయడం బట్టి రానున్న రోజులలో మహేష్ మళ్ళీ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నటిస్తాడా అన్న సందేహాలను కలిగించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు కూడ మంచి స్పందన రావడంతో నాని ఈ సినిమాతో మరో హిట్ కొట్ట బోతున్నాడా ? అన్న సంకేతాలు వచ్చాయి.
అయితే అనుకోని ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా నిర్మాతలు మాట్లాడుతూ గతంలో తాము తెలియక చేసిన పొరపాట్లను ఇప్పుడు సరి దిద్దుకుంటున్నాము అన్న మాటలు బట్టి మహేష్ తో ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి భారీ సినిమాలను అనాలోచితంగా నిర్మించాము అన్న సంకేతాలు ఇచ్చాడా అన్న అనుమానాలు మరి కొందరికి కలిగాయి. ఏమైనా మహేష్ రాకతో ఈ ఆడియో వేడుక కళకళ లాడింది..