ఈమధ్య కాలంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం సాధారణ విషయంగా మారింది. అయితే ఈసారి మహేష్ ఏకంగా పవన్ కళ్యాణ్ కే ప్రశ్నలు వేస్తూ నిన్న విశాఖపట్నంలో ‘జనసేన’ పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన ప్రసంగం పై కత్తి మహేష్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 
KATHI MAHESH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటి వరకు కేవలం పవన్ అభిమానులకు మాత్రమే శత్రువుగా మారిన మహేష్ ఈసారి తన రూట్ మార్చి ఏకంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెనుక ఎదో ఒక అజ్ఞాత శక్తీ ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం మహేష్ తన ఫేస్ బుక్ లో పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ పై కూడ ప్రముఖ ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసాయి అంటే మహేష్ కామెంట్స్ ఎంత చిచ్చు రేపుతున్నాయో అర్ధం అవుతుంది. 

‘అన్నను, పి.ఆర్.పి.ని మోసం చేసినవాళ్ల సంగతి సరే, మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో’ అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో చేసిన కామెంట్స్ కు ఎదో ఒక సందర్భంలో సమాధానం ఇవ్వవలసిన పరిస్థితి పవన్ కు ఏర్పడింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్త తరహా రాజకీయం అంటూ పవన్‌ పై కత్తి మహేష్ వేసిన చురకలు మరోరకమైన కొత్త చర్చలకు తెర తీస్తున్నాయి.

ఇప్పటి దాకా తమ అన్న దమ్ముల మధ్య రాజకీయ ఉద్దేశ్యాలలో వైరిధ్యం ఉంది అంటూ ప్రసంగాలు చేసిన పవన్ ఇప్పుడు రూట్ మార్చి తన అన్న చిరంజీవికి అన్యాయం చేసిన వారిని ఏ ఒక్కరినీ వదలను అంటూ కామెంట్ చేయడం వెనుక అర్ధాలు ఏమిటి అని మహేష్ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు తమ అన్నదమ్ములు ఇద్దరము కలిపోయాము అని ఓపెన్ గా చెపితే ప్రజలకు క్లారిటీ ఉంటుంది కదా అంటూ మహేష్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటే ఎదో ఒక సందర్భంలో మహేష్ కామెంట్స్ కు సమాధానం చెప్పవలసిన పరిస్థితి పవన్ కు ఏర్పడింది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: