పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి జనసేన పార్టీతో ఎన్నికల బరిలో దిగాలని చూస్తున్నాడు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాన్ ప్రస్తుతం రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాడు. తన ఫ్యాన్స్ సపోర్ట్ తో ప్రజలకు మేలు చేసే రాజకీయాలను సాధించేందుకు ప్రశ్నించేలా శక్తిగా మారుతున్నాడు పవన్ కళ్యాణ్.


అయితే పవన్ ఎన్నికల్లో పాల్గొనడం మాట అటుంచితే ఫ్యాన్స్ అప్పుడే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసేశారు. అదెలా కుదురిద్ది అంటే రీసెంట్ గా కొరటాల శివ డైరక్షన్ లో మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను టీజర్ రిలీజ్ అయ్యింది. విజన్ ఆఫ్ భరత్ అంటూ యూట్యూబ్ ను షేక్ చేసిన భరత్ అనే నేను టీజర్ లో చివరలో మహేష్ భరత్ రామ్ ముఖ్యమంత్రి బోర్డ్ ను సరిచేస్తుంటాడు. 


ఇదే పవన్ ఫ్యాన్స్ తమ హీరోకి సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటూ ఎడిట్ చేసి పవన్ కూర్చున్న స్టిల్ ను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ నిజంగా సిఎం అవుతాడో లేడో కాని పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం మాత్రం పీక్స్ కు వెళ్లిందని మాత్రం చెప్పొచ్చు.


తన మార్క్ రాజకీయ మార్గాలను సుగుమం చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ నిజంగానే సిఎం క్యాండిడేట్ అంటే నమ్మాల్సిదే. అయితే ఈమధ్య తన మీటింగ్స్ లో తన పార్టీ పసిబిడ్డ అని పాతికేళ్ల తర్వాత విజన్ ఆలోచించాలని అన్నాడు పవన్ కళ్యాణ్. మొత్తానికి మంచి విజన్ తోనే పవన్ ముందుకెళ్తున్నాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: