మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న రంగ‌స్థ‌లం సినిమా ఈ రోజు శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాన‌ట్టుగా 1750 థియేట‌ర్ల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఏపీ, తెలంగాణ‌, చెన్నై, క‌ర్నాట‌క, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్సీస్‌తో పాటు అర‌బ్ కంట్రీస్‌లో సైతం రంగ‌స్థ‌లం సినిమాను మైత్రీ మూవీస్ వారు భారీ ఎత్తున రిలీజ్ చేశారు. 

Related image

ఇక రంగ‌స్థ‌లం సినిమాపై ఉన్న బ‌జ్‌, అంచ‌నాల నేప‌థ్యంలో సినిమాకు చెర్రీ కెరీర్‌లో ఏ సినిమాకు జ‌ర‌గ‌ని రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అన్ని ఏరియాల్లోనూ సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతో బ‌య్య‌ర్లు భారీ రేట్లు కుమ్మ‌రించి మ‌రీ రంగ‌స్థ‌లం రైట్స్ సొంతం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ వ‌ర‌కే ఈ సినిమాను రూ.62 కోట్ల‌కు కొన్నారు.

Image result for rangasthalam movie stills

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట్రిక‌ల్ రైట్స్ చూస్తే రూ.80 కోట్ల‌కు రంగ‌స్థ‌లం అమ్ముడైంది. ఇక శాటిలైట్‌, హిందీ డ‌బ్బింగ్‌, ఇత‌ర‌త్రా రైట్స్ చూస్తే ఈ సినిమా రూ.112 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా చూసినా రూ.80 కోట్ల షేర్ రాబ‌డితే బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చిన‌ట్ల‌వుతుంది. అంటే సుమారుగా రూ.110 కోట్ల పైన గ్రాస్ వ‌సూళ్ల‌ను ఈ సినిమా రాబ‌ట్టాలి. సోలో రిలీజ్ మాత్రం సినిమాకు క‌లిసి రానుంది. 

Image result for rangasthalam movie stills

' రంగ‌స్థ‌లం ' ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ (రూ.కోట్ల‌లో)
నైజాం - 18  
సీడెడ్ - 12  
వైజాగ్ - 8  
ఈస్ట్ - 5.4  
వెస్ట్ -  4.2  
కృష్ణా - 4.8  
గుంటూరు - 6.6  
నెల్లూరు - 3 
---------------------------------- 
ఏపీ + తెలంగాణ = 62 కోట్లు
-----------------------------------
కర్ణాటక - 7.6  
రెస్టాఫ్ ఇండియా - 1.4 
ఓవర్సీస్ - 9  
-------------------------------------- 
మొత్తం వరల్డ్ వైడ్ =  80 కోట్లు
---------------------------------------
తెలుగు శాటిలైట్ - 20  
హిందీ డబ్బింగ్ - 10.5  
అద‌ర్ ఏరియాస్ -  1.5 
----------------------------------- 
మొత్తం బిజినెస్ :112 కోట్లు
-------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: