క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి లోకల్ మీడియాను పట్టించు కోవడం లేదని కేవలం తన ఫోకస్ అంతా నేషనల్ మీడియా పైనే పెడుతున్నాడు అంటు రాజమౌళి పై కోపం ప్రదర్శిస్తోంది తెలుగు మీడియా. దీనికి కారణం ఈ మధ్య జరిగిన ఒక చిన్న సంఘటన అని అంటున్నారు. లోకల్ మీడియా వాళ్ళు రాజమౌళిని ‘బాహుబలి’ అప్ట్ డేట్స్ ఏమిటి అని అడిగితే ఏమిలేవంటు సమాధానాలు దాట వేసే రాజమౌళి తన ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి నేషనల్ మీడియాకు వార్తలను లీక్ చేస్తున్నాడు అంటూతెలుగు మీడియా వర్గాల బాధ.
ఈమధ్య ‘బాహుబలి’ సినిమాలో 2000 మందితో ఒక యుద్ధం సీన్ ను రాజమౌళి షూట్ చేస్తున్నాడు అన్న విషయం నేషనల్ మీడియాలో వచ్చాక మాత్రమే తెలుగు మీడియా వారికి తెలిసిందట. దీనితో మైండ్ బ్లాంక్ అయిన తెలుగు మీడియా వర్గాలు తమ భాషలో నిర్మించే సినిమాల గురించి వార్తలు తెలుసుకోవడానికి నేషనల్ మీడియా పై ఆధార పడి వార్తలు రాసుకోవలా అంటు జక్కన్న పై కోపాన్ని ప్రదర్శిస్తోందట తెలుగు మీడియా. షూటింగ్ బిజీలో ఖాళీ లేకుండా ఉంటే కనీసం ఒక ప్రెస్ నోట్ అయిన ఇవ్వచ్చు కదా అని వీరి వాదన.
ఇంతకీ రాజమౌళి తెలుగు మీడియాను ఇంతగా దూరం పెట్టడానికి ఆ మధ్య ‘బాహుబలి’ మేకింగ్ వీడియో టీజర్ విడుదలైన తరువాత అది పలానా ఇంగ్లీష్ సినిమాకు కాపీ అంటు కొన్ని ఛానల్స్ అలాగే ప్రింట్ వెబ్ మీడియా వర్గాలు రాజమౌళి పై వార్తలు రాయడం ఈ కోపానికి కారణం అనుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: